శాంసంగ్ ‘‘మిడిల్ క్లాస్ స్మార్ట్‌ఫోన్’’ లాంచింగ్ ఈ రోజే

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ జియోమీకి దీటుగా దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్ మధ్య తరగతి ప్రజలకు చౌక దరలో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తోంది. ఎం10, ఎం20 పేర్లతో ఉత్పత్తి చేసిన ఈ ఫోన్లను సోమవారం భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నది.
 

Samsung Galaxy M10 for Rs 7,990, M20 for Rs 10,990 in India on Jan 28

దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘శామ్‌సంగ్’తనకు సవాల్ విసురుతున్న చైనా మేజర్ జియోమీతో సై అనేందుకు సిద్దమైంది. తొలిసారిగా మధ్య తరగతి ప్రజలకు చౌకగా అందుబాటులోకి స్మార్ట్ ఫోన్లను తెచ్చేందుకు సిద్ధమైంది. 

అందులో భాగంగా సోమవారం శామ్‌సంగ్ గ్యాలక్సీ ఎం10 అండ్ ఎం 20 పేరిట రెండు మోడళ్ల ఫోన్లను ఆవిష్కరించనున్నది. అయితే ‘ఎం’సిరీస్‌లో శామ్‌సంగ్ గ్యాలక్సీ ఎం 10 ఫోన్ రూ.7,990లకు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది. ఎం 20 ఫోన్ ధర రూ.10, 990లకు లభిస్తుంది.

శామ్‌సంగ్ గ్యాలక్సీ ఎం10 మోడల్ 2జీ స్టోరేజీ ఫోన్ ధర మీడియాలో వచ్చినట్లు రూ.8,990లకు వార్తలు వచ్చాయి. శామ్‌సంగ్ గ్యాలక్సీ ఎం10 మోడల్ 2జీ స్టోరేజీ ఫోన్ రూ,7,990, 32జీబీ వర్షన్ ఫోన్ రూ.8,990లకు లభిస్తాయి. 4జీబీ అండ్ 64 జీబీ వేరియంట్ల ఫోన్ల ధర రూ.12,990లకు లభిస్తుందని వార్తలొచ్చాయి. 

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మార్చి ఐదో తేదీ నుంచి యూజర్లకు శామ్ సంగ్ గ్యాలక్సీ ఎం10, ఎం20 ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. శామ్‍సంగ్ ఆన్‍లైన్ స్టోర్లలోనూ లభిస్తాయి. శామ్‌సంగ్‘ఎం’ సిరీస్‌ ఫోన్లు తొలిసారి అంతర్జాతీయంగా భారత్ మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని శామ్‌సంగ్ ఇండియా గ్లోబల్ ఉపాధ్యక్షుడు అసిం వార్సీ పేర్కొన్నారు. 

శామ్‌సంగ్ గ్యాలక్సీ ‘ఎం’ సిరీస్ ఫోన్లు నోయిడాలోని మిలినియల్ ఉత్పాదక యూనిట్‌లో ఉత్పత్తవుతున్నది. శామ్ సంగ్ ఎం 20 మోడల్ ఫోన్లలో 5000 ఎంఏహెచ్, శామ్ సంగ్ గ్యాలక్సీ ఎం 10 ఫోన్ 3,400 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.

శామ్ సంగ్ గ్యాలక్సీ ఎం సిరీస్ మోడల్ స్మార్ట్ పోన్లలో పవర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, మెమొరీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నదని అసిం వార్ని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios