చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయరీ సంస్థ  షియోమీ ప్రపంచ మార్కెట్ ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. వివిధ దేశాల్లో స్మార్ట్‌ఫోన్ల సామాజ్యాన్ని ఈ కంపనీ శాసిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కువ పీచర్లతో  అతి తక్కువ  ధరలకే దొరికే ఈ కంపనీ స్మార్ట్‌ఫోన్లపై యువత మనసు పారేసుకుంటున్నారు. దీంతో తమ వినియోగదారులను మరింత ఆకట్టుకునే ఉద్దేశంతో మరో కొత్త మోడల్ ఫోన్‌ని షియోమి సంస్థ ఇవాళ చైనా మార్కెట్లోకి విడుదల చేసింది.

రెడ్ నోట్ 7 పేరుతో విడుదలైన ఈ ఫోన్ లో బ్యాక్ 48,5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలను, ప్రంట్ లో 13 మెగాఫిక్సల్ కెమెరాలను అందించారు. దీంతో వినియోగదారులకు మరింత స్పష్టతతో కూడిన ఫోటోలు, వీడియోలు అందించి తమ మార్కెట్ ను మరింత పెంచుకోవాలని  షియోమీ భావిస్తోంది. అంతేకాకుండా 6.3 ఇంచుల భారీ డిస్ ప్లే, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ భారీ బ్యాటరీని అందించారు. 

అయితే ఇన్ని ఫీచర్లతో కూడిన ఈ రెడ్‌మీ నోట్7 స్మార్టఫోన్‌ను అతి తక్కువ ధరకే షియోమీ  వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియాలో 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ ఫోన్ ధ‌ర రూ.10,390, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ఫోన్ ధ‌ర రూ.12,460లకు అందిచనున్నట్లు కంపనీ ప్రకటించింది. అయితే దీన్ని పొందాలంటూ భారతీయులు మరో ఐదురోజులు ఆగాల్సిందే.  ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫోన్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు షియోమి సంస్థ ప్రకటించింది.