చైనాకు ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ షియోమి వినియోగదారులకు శుభవార్త అందించింది. తమ సంస్థ నుండి ఇదివరకే వెలువడిన రెడ్‌మీ6 మోడల్ స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. అయితే ఈ తగ్గింపు తాము నిర్ణయించిన పరిమిత కాలంలోపు కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని షరతులు విధించింది. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు రెడ్‌మీ6 మోడల్ తగ్గింపు ధరలపై అందించనున్నట్లు రెడ్‌మీ ఇండియా అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

రెడ్‌మీ మోడల్ కు చెందిన 6,6ప్రొ, 6ఎ స్మార్ట్‌ఫోన్లను తాము గతంలో నిర్ణయించిన ధరలకంటే దాదాపు రూ.500 నుండి రూ.1000 తక్కువ ధరకు అందిస్తున్నట్లు షియోమీ వెల్లడించింది. 3జీబీ ర్యామ్ తో కూడిన 6ప్రొ వేరియెంట్ ధర రూ.9,999 వుండగా వెయ్యి రూపాయలు తగ్గి రూ.8,999 ధ‌ర‌కు లభిస్తోంది. అలాగే  4జీబీ ర్యామ్ 6ప్రొ వేరియెంట్ కూడా గతంలో రూ.11,999 వెయ్యి రూపాయల ధరకు లభించగా ఈ ఆఫర్ లో భాగంగా రూ.10,999 ధ‌ర‌కే లభిస్తోంది. 

ఇక 3జీబీ ర్యామ్ తో కూడిన రెడ్‌మీ 6వేరియంట్ మొబైల్ రూ.500 తగ్గి రూ.8,499,2జీబీ ర్యామ్ రెడ్‌మీ 6ఎ వేరియెంట్ రూ.6,499 ధరకు లభిస్తోంది. ఈ తగ్గింపు ధరలతో రెడ్‌మీ స్టోర్లు, అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని షియోమీ ప్రకటించింది.