అత్యంత ప్రజాదరణ పొందింది సెర్చింజన్ గూగుల్‌ స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్‌ 3 స్మార్ట్‌ఫోన్‌. దీని కొనుగోలుపై వినియోగదారులకు  పేటీఎం మాల్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. తద్వారా గూగుల్ పిక్సెల్ 3 64 జీబీ (జస్ట్‌ బ్లాక్‌) వెర్షన్‌పై ఆరు శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. దీనికి అదనంగా రూ.6000 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. దీంతో  సుమారు రూ. 10వేల తగ్గింపుతో రూ. 60,482 లకే అందుబాటులోకి రానున్నది.

దీని అసలు ధర రూ. 71వేలుగా ఉన్నది. అలాగే  'క్లియర్లీ వైట్' గూగుల్‌ పిక్సెల్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ కూడా తగ్గింపు తర్వాత రూ. 60,487లకే లభించనుంది. ఆసక్తి గల వినియోగదారులు మిగిలిన వివరాలు పేటీఎం మాల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

ఇవే గూగుల్ ‘పిక్సెల్ 3’ ఫీచర్లు
గూగుల్ పిక్సల్ 3 స్మార్ ఫోన్ 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉండటంతోపాటు 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ లభిస్తుంది. ఇక ఆండ్రాయిడ్ 9.0 పై కూడా అందుబాటులో ఉంటుంది.

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ అమర్చిన ఈ ఫొన్‌ సామర్థ్యం 4 జీబీ ర్యామ్ కాగా, 64/128 జీబీ నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఇక 12.2ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా అమర్చారు. ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ అదనపు స్పెషాలిటీ కాగా, 2915 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. 

ట్రెడిషన్ కు భిన్నంగా హువాయ్ ‘నోవా 4’
ఇక చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ హువాయ్ సంప్రదాయ డిజైన్లకు భిన్నంగా ‘నోవా 4’ పేరుతో ఓ కొత్త ఫోన్‌ విడుదల చేసింది. ఎడ్జ్‌ టు ఎడ్జ్‌ తాకే తెరపై కేవలం ఒక రంద్రం మాత్రమే కనిపించడం దీని స్పెషాలిటీ. అంతేకాకుండా దీని వెనుక కెమెరాకు ఏకంగా 48 మెగా పిక్సల్‌ సామర్థ్యం ఉంది.

ఇదే మోడల్‌ను 20 మెగా పిక్సల్‌ వేరియంట్‌లోనూ అందుబాటులోకి తెస్తున్నారు. డిస్‌ప్లేపై ముందువైపు ఉన్న రంద్రంలో 25 మెగా పిక్సల్‌ కెమెరాను అమర్చారు. నోవా 4ను హువాయ్‌ సంస్థ సోమవారం చైనాలో విడుదల చేసింది. ఓ టెక్‌ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. భారత కరెన్సీలో 48 మెగా పిక్సల్‌ వేరియంట్‌ ‘నోవా 4’ ఫోన్ ధర సుమారు రూ.35,300 కాగా, 20 మెగా పిక్సల్‌ ధర రూ.32,200 ఉంది.

నోవా 4 ఫీచర్లు ఇవే
1080x2310 పిక్సల్స్‌ సామర్థ్యంతో 6.4 అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లే ఉంటుంది. ఇక వెనుకవైపు 48 +6 ఎంపీ+2 ఎంపీ కెమెరా, ముందువైపు 25 మెగా పిక్సల్‌ కెమెరా అమర్చారు. ఆండ్రాయిడ్‌ 9.0 ఓఎస్‌తోపాటు 2.36 గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ అమర్చారు. 3,750 ఎంఏహెచ్‌ బ్యాటరీ ప్లస్ 8 జీబీ ర్యామ్ దీని సామర్థ్యం. 128 జీబీ ఇంటర్నెల్‌ మెమరీ కూడా కలిగి ఉంటుందీ ‘నొవా 4’.