ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరో దిగ్గజ కంపెనీ తరలిరానుంది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో హైదరాబాద్‌లో ఆర్&డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 

ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు మరో దిగ్గజ కంపెనీ తరలిరానుంది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో హైదరాబాద్‌లో ఆర్&డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇది భారత్‌లో తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్. భారత్‌లోని వినియోగదారులకు ప్రత్యేకమైన టెక్నాలజీని అందించాలన్న లక్ష్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పో ఇండియా ప్రెసిడెంట్‌ చార్లెస్ వాంగ్ తెలిపారు.

సరికొత్త సాంకేతికతతో భారతీయులకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఈ డెవలప్‌మెంట్ సెంటర్ ‌అత్యంత కీలకంగా వ్యవహరించనుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఒప్పోకు చైనా, జపాన్, అమెరికాల్లో మొత్తం ఆరు ఆర్&డీ సెంటర్లు వుండగా... హైదరాబాద్‌లో ఏడాది నెలకొల్పుతున్నట్లు ఆయన తెలిపారు.

చైనా తర్వాత రెండో అతిపెద్ద పరిశోధనా కేంద్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు వాంగ్ స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, మరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు.