వావ్ ఒప్పో.. 14.60 లక్షలు దాటిన రెనో సిరీస్ ఫోన్ల బుకింగ్స్

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో తన తొలి 5జీ స్మార్ట్​ ఫోన్​ను స్వదేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. రెనో 2కి కొనసాగింపుగా.. రెనో 3ప్రో, రెనో 3 పేర్లతో ఒకే సారి రెండు 5జీ మోడళ్లను విడుదల చేసింది ఆ సంస్థ. ఈ ఫోన్ భారత్ విపణిలోకి మార్చికల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. 
 

Oppo Reno3 series racks up more than 1.46 million registrations

బీజింగ్: చైనా స్మార్ట్​ఫోన్ల తయారీ దిగ్గజం ‘ఒప్పో’ 5జీ టెక్నాలజీలో ప్రత్యర్థి సంస్థలకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మార్కెట్లోకి విడుదల చేసిన రెండు రోజుల్లోనే కేవలం చైనాలోనే 14.60 లక్షల మంది ఈ ఫోన్ బుక్ చేసుకున్నారు. ఇందులో భాగంగా చైనా మార్కెట్‌లో ఒప్పో నుంచి తొలి 5జీ స్మార్ట్​ఫోన్​ను రెండు రోజుల క్రితం ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్​లోని రెనో శ్రేణికి కొనసాగింపుగా ఒకే సారి రెండు మోడళ్లను విడుదల చేసింది ఆ సంస్థ. రెనో 3ప్రో, రెనో 3 పేర్లతో మార్కెట్లోకి వచ్చిన ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: గుడ్ న్యూస్.. ఆ పేమెంట్స్‌‌పై ఇక ఛార్జీలు ఉండవు

 

రెనో 3ప్రో ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765జీ చిప్​ సెట్ అమర్చారు. ​8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.40వేలు), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర 4,499 యువాన్లు (సుమారు రూ.45వేలు) ఉంటుంది. 

ఈ ఫోన్‌లో వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ + 8 ఎంపీ + 13 ఎంపీ + 2 ఎంపీ), 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా, ఆన్ డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్​ ఫీచర్లు ఉన్నాయి. ఇది 4,025 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 

Also Read: ఇక వాట్సాప్​ మెసేజేస్ వాటంతట అవే మాయం.. ఎలాగంటే!

రెనో 3 ప్రో ఫోన్ 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ఎల్ చిప్‌ సెట్ అమర్చారు. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లు (సమారు రూ.34,000), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర 3,699 యువాన్లు (ధర రూ.37,000) పలుకుతుంది.

వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ) ఉన్నాయి. 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరాతోపాటు ఆన్ డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్​, 4,025 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ జత కలిపారు. ఈ స్మార్ట్​ఫోన్ భారత్​లోకి వచ్చేది ఏప్పుడని ఒప్పో స్పష్టతనివ్వకున్నా వచ్చే ఏడాది మార్చిలో దేశీయ విపణిలోకి ఈ మోడల్​ రానున్నట్లు టెక్​ వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios