ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్ బెస్ట్: ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల సేల్స్ ఐదు కోట్లు?!

ఈ ఏడాది భారత్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఐదు కోట్ల స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు దాటొచ్చని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక అంచనా వేసింది. భారీ రాయితీలు, బైబ్యాక్‌ ఆఫర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి బడా ఈ-కామర్స్‌ కంపెనీలు అందిస్తున్న సులభ ఫైనాన్స్‌ సౌకర్యాలు ఈ ఏడాది ఆన్‌లైన్‌ విక్రయాలు మరింత పుంజుకోవడానికి దోహదపడనున్నాయని సంస్థ పేర్కొంది.

Online smartphone sales in India expected to cross 50-mln mark this year

ఈ ఏడాది భారత్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఐదు కోట్ల స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు దాటొచ్చని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజా నివేదిక అంచనా వేసింది. భారీ రాయితీలు, బైబ్యాక్‌ ఆఫర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి బడా ఈ-కామర్స్‌ కంపెనీలు అందిస్తున్న సులభ ఫైనాన్స్‌ సౌకర్యాలు ఈ ఏడాది ఆన్‌లైన్‌ విక్రయాలు మరింత పుంజుకోవడానికి దోహదపడనున్నాయని సంస్థ పేర్కొంది.

గత ఏడాదిలో ఆన్‌లైన్‌ విక్రయాలు 4.5 కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 60-65 శాతం మేర పెరగవచ్చని మరో పరిశోధన సంస్థ సీఎంఆర్‌ అంచనా వేసింది. అదే సమయంలో ఆఫ్‌లైన్‌ అమ్మకాలు 4-6 శాతం మేర తగ్గవచ్చని అంటోంది.
 
దసరా, దీపావళి పండగ సీజన్‌ సందర్భంగా గతనెల10 నుంచి ఈనెల ఐదవ తేదీ వరకు ఈ కామర్స్‌ కంపెనీలు మూడుసార్లు మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లతో పాటు పలు ఆకర్షణీయ పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. దాంతో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఆఫర్‌ సమయంలో ఒక్కో రోజు లక్షల కొద్ది స్మార్ట్‌ఫోన్లను విక్రయించగలిగాయి.

గత నెల 10-14 మధ్యలో నిర్వహించిన బిగ్‌ బిలియన్‌ డే సేల్స్‌ సందర్భంగా కేవలం ఒక గంటలో 10 లక్షలు, ఆ రోజు మొత్తంలో 30 లక్షల ఫోన్లను విక్రయించినట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. దేశంలోని మొబైల్‌ రిటైల్‌ మార్కెట్లో ఇదే ఆల్‌టైమ్‌ రికార్డు.

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ స్పందిస్తూ ఆఫ్ లైన్ సేల్స్ 11 శాతం పెరిగితే ఆన్ లైన్ విక్రయాలు 51 శాతం అభివ్రుద్ది చెందాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది. డిసెంబర్ నెలాఖరుతో ముగిసే త్రైమాసికానికి స్మార్ట్ ఫోన్ల విక్రాయల్లో 25 శాతం పురోగతి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios