భారత్‌లో నోకియా ధరల తగ్గింపు

నోకియా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తన ఖాతాదారులను కాపాడుకునేందుకు భారతదేశంలో తన కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ల ధరలపై రాయితీలు ప్రకటించింది. వివిధ రకాల స్మార్ట్ ఫోన్లపై రూ.1000 నుంచి రూ.1500 ధరలు తగ్గించి విక్రయిస్తోంది.

Nokia 3.1, Nokia 5.1, Nokia 6.1, Nokia 8 Sirocco Price in India Slashed

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ భారత్‌లో నోకియా స్మార్ట్ ఫోన్లలో కొన్నింటి ధరలను తగ్గించివేసింది. ఎంట్రీ లెవల్ మోడల్ ఫోన్ల ధరలను రూ.1000 నుంచి రూ.1,500లకు తగ్గించనున్నట్లు తెలిపింది. నోకియా ఫ్లాగ్ షిప్ ధర రూ.13 వేలకు లభించనున్నది.

ఎంట్రీ లెవల్ నోకియా 3.1 మోడల్ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,690లకు లభించనున్నది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల నోకియా 3.1 మోడల్ స్మార్ట్ ఫోన్ ను రిటైల్ స్టోర్లలో రూ.11,999లకు విక్రయిస్తుండగా, ధర తగ్గింపుతో రూ.10,999లకు లభించనున్నది. గత మేనెలలో భారతదేశ మార్కెట్ లో విడుదలైన నోకియా 3.1 మోడల్ స్మార్ట్ ఫోన్‌తోపాటు నోకియా 2.1, నోకియా 5.1 మోడల్ ఫోన్లు రూ.12,349లకు లభిస్తాయి. 

నోకియా 3.1 మోడల్ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రాంలో ‘ఆండ్రాయిడ్ 8.0 ఓరియో’పై ఆధారపడి చేసి చేస్తుంది. ఇందులో 5.2 అంగుళాల హెచ్డీ ప్లస్ (720x1440 పిక్సెల్స్) డిస్ ప్లేతోపాటు కార్నింగ్  గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓక్టాకోర్ మీడియా టెక్ ఎంటీ6750 ఎస్వోసీ సామర్థ్యం గల ఇంధనం దీని సొంతం. 

తదుపరి 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల నోకియా 5.1 మోడల్ స్మార్ట్ ఫోన్ ధర రూ.1500 తగ్గి, రూ.12,999లకు లభిస్తుంది. నోకియా 5.1లో 5.5 అంగుళాల పొడవైన హెచ్డీ ప్లస్ (1080x 2160 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేతో పని చేస్తుంది. ఓక్టాకోర్ మీడియా టెక్ ఎంటీ6755 ఎస్వోసీ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది.  

నోకియా 6.1 మోడల్ స్మార్ట్ ఫోన్ కూడా 3జీబీ ర్యామ్ / 32 జీబీ స్టోరేజీ, 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. దాని ధరపై వరుసగా రూ.1500, రూ.1000 తగ్గించి వేశారు. ప్రస్తుతం 3జీబీ నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ రూ.13,499లకు, 4జీబీ నోకియా 6.1 స్మార్ట్ ఫోన్ రూ.16,499లకే లభిస్తుంది. 

3జీబీ ర్యామ్ సామర్థ్యం గల నోకియా 6.1 అకా నోకియా 6 మోడల్ స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ నెలలో భారత మార్కెట్ లో రూ.16,999లకు, నెల రోజుల తర్వాత 4జీబీ ర్యామ్ సామర్థ్యం గల నోకియా 6.1 ఆకా మోడల్ స్మార్ట్ ఫోన్ ధర రూ.18,999గా నిర్ణయించారు. ఈ రెండు వెరైటీ ఫోన్లపై రూ.1,500 రాయితీని ప్రకటించింది హెచ్ఎండీ గ్లోబల్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios