ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ లెనోవాకు చెందిన మోటోరోలా కంపెనీ వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. తన మోటో ఎక్స్ 4 స్మార్ట్ ఫోన్ ధరపై భారీ తగ్గింపు ధర ప్రకటించింది. 3జీబీ ర్యామ్‌, 4జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న వేరియంట్లలో, 3జీబీ ర్యామ్‌ మోడల్‌పై ధర తగ్గించినట్టు తెలిసింది. 3జీబీ ర్యామ్‌ మోడల్‌ ధరను రూ.7000 తగ్గించి, రూ.13,999కు అందుబాటులోకి తెచ్చింది. 

అంతకముందు ఈ వేరియంట్‌ ధర 20,999 రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌ సైటులో 3జీబీ ర్యామ్‌, 4జీబీ ర్యామ్‌ రెండు వేరియంట్లలో ధర తగ్గినట్టు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్‌ ఆ మోడల్స్‌పై 5000 రూపాయల ధర తగ్గించినట్టు వెల్లడైంది. అంటే ఫ్లిప్‌కార్ట్‌ 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.15,999కు, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను 17,999 రూపాయలకు అందుబాటులో ఉంచింది. 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర 22,999 రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే. 

మరోవైపు అమెజాన్‌ సైట్‌లో కూడా మోటో ఎక్స్‌4 లిస్ట్‌ అయింది. 3జీబీ వేరియంట్‌ 13,744 రూపాయలకు, 4జీబీ వేరియంట్‌ 15,767 రూపాయలకు, 6జీబీ వేరియంట్‌ 19,998 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. 

మోటో ఎక్స్‌4 ఫోన్ ఫీచర్లు...
డ్యూయల్‌ సిమ్‌(నానో)
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
5.2 అంగుళాల హెచ్‌డీ ఎల్‌టీపీఎస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 ఎస్‌ఓసీ
12 మెగాపిక్సెల్‌, 8 మెగాపిక్సెల్‌తో డ్యూయల్‌ బ్యాక్‌ కెమెరా
 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరణ మెమరీ
3000 ఎంఏహెచ్‌ నాన్‌-రిమూవబుల్‌ ఆల్‌-డే బ్యాటరీ