ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్ కొనాలంటే ముందుగా గుర్తొచ్చేవి ఆన్ లైన్ షాపింగ్ సైట్స్. ఈ ఆన్  లైన్ సైట్లతో బయటి కంటే తక్కువ ధరకే నచ్చిన మొబైల్ లభిస్తుండటంతో ప్రతిఒక్కరు వీటినే ఆశ్రయిస్తున్నారు. దీంతో చిన్న చిన్న మొబైల్స్ సేలింగ్ షాప్ లు గిరాకీలు లేక వెలవెలబోతుడటం మనం చూస్తూనే వున్నాం. అయితే కొందరు మొబైల్ షాపుల యజమానులు వినూత్నంగా ప్రయత్నించి తమ అమ్మకాలను పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం వారుకూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. 

తాజాగా కొన్ని సెల్‌ఫోన్ షోరూంలు, చిన్న షాపులు వినియోగదారులను ఆకట్టుకోడానికి ఓ మంచి ఆఫర్ ప్రకటించాయి. తమ వద్ద కొన్న సెల్ ఫోన్లలో ఏదైనా సమస్య ఏర్పడితే తామే ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని ప్రకటించాయి. అదికూడా వినియోగదారులు షాపులకు వచ్చే అవసరం లేకుండా తామే వారి ఇంటికి వెళ్లి ఫోన్ ను రిపేర్ చేసి ఇస్తామని ప్రకటించాయి. 

ఇక సెల్ ఫోన్ లో ఏదైనా ప్రధాన సమస్య వుండి  రిపేరుకు రెండు మూడు రోజుల పమయం పడితే అప్పటివరకు కస్టమర్ వాడుకోడానికి ఒక ఫోన్ ఇస్తామమంటూ తెలిపారు. ఇలా వివిధ ఆఫర్లను ప్రకటించి మళ్లీ తమ సేల్స్ పెంచుకోవాలని  మొబైల్ షాపుల యజమానులు భావిస్తున్నారు. ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ కు ఫోటీ ఇవ్వాలంటే ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాల్సిందేనని ఓ మొబైల్ షాప్ యజమాని తెలిపారు.