బిల్‌గేట్స్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ స్థాపించిన ‘‘పాల్ ఎలెన్’’ కన్నుమూత

ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఎలెన్ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఎన్‌‌హెచ్ఎల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సీటెల్‌లో‌ తుదిశ్వాస విడిచారు. 

Microsoft co-founder Paul Allen died

ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఎలెన్ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఎన్‌‌హెచ్ఎల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సీటెల్‌లో‌ తుదిశ్వాస విడిచారు. పాల్ మరణవార్తను ఆయన సోదరి ధ్రువీకరించారు.

1975లో బిల్‌గేట్స్‌తో కలిసి ఎలెన్‌పాల్ మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. మైక్రోసాఫ్ట్‌లో వాటాతో పాటు.. ఇతరత్రా ఆస్తులతో కలిపి 20.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 46వ స్థానంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌లో ఉంటూనే 1986లో ఉల్కన్ ఇంక్ అనే మరో కంపెనీని పాల్ స్థాపించారు.

ఆయన మరణంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. ‘‘ మైక్రోసాఫ్ట్‌తో పాటు ఐటీ రంగానికి పాల్ ఎంతో సేవ చేశారు.. సహ వ్యవస్థాపకుడిగా నిరంతర శ్రమతో ఎన్నో విజయాలు సాధించారు. మాకు మరెన్నో అనుభూతులు, అనుభవాలు అందించారు.. సంస్థలో చేరిన నాటి నుంచి తాను పాల్ వద్ద నుంచి ఎంతో నేర్చుకున్నానని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సత్య నాదెళ్ల ఒక ప్రకటనలో తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios