Asianet News TeluguAsianet News Telugu

మ్యూజిక్ లవర్స్ కోసం వింగాజాయ్ కొత్త వైర్‌లెస్ టవర్ స్పీకర్‌.. దీనిని ఎక్కడికైనా మడతపెట్టి తీసుకేల్లోచ్చు..

వింగాజాయ్ కొత్త వైర్‌లెస్ స్పీకర్ వింగాజాయ్ జివిటి -298ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని బడ్జెట్ ధర రూ .2,999 వద్దకే తీసుకొచ్చారు. 

Made in India brand VingaJoy launches new wireless speaker with FM radio will also be supported and more
Author
Hyderabad, First Published Jun 21, 2021, 7:33 PM IST

స్వదేశీ మొబైల్ అసెసోరిస్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వింగాజాయ్ కొత్త వైర్‌లెస్ స్పీకర్ వింగాజాయ్ జివిటి -298ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని బడ్జెట్ ధర రూ .2,999 వద్దకే తీసుకొచ్చారు. ఈ స్పీకర్ ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం లుక్‌తో వస్తుంది.

వినియోగదారుల సౌలభ్యం కోసం యూ‌ఎస్‌బి ప్లేయింగ్ ఆప్షన్  కూడా ఇందులో అందించారు. ఈ స్పీకర్ క్రిస్టల్-క్లియర్ హై క్వాలిటీ సౌండ్ ఇంకా మన్నికైన బ్యాటరీ లైఫ్ ఇస్తుందని తెలిపింది. ఈ స్పీకర్ ని మూడు వేర్వేరు రంగులలో కొనుగోలు చేయవచ్చు.

కొత్త స్పీకర్ వింగాజాయ్ జివిటి -298 బ్లూటూత్ వి5.0తో వస్తుంది. అలాగే 11 మీటర్ల పరిధితో ఉన్న బ్లూటూత్ డివైజెస్ తో కనెక్ట్ చేయవచ్చు. దీనిలో 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఉంది, ఇంకా 5 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజెస్, ల్యాప్‌టాప్‌లతో సులభంగా పేర్ చేయవచ్చు. ఈ స్పీకర్ ఎఫ్ఎమ్ రేడియో / ఆక్స్ / ఎటిఎఫ్, యుఎస్‌బి వంటి వివిధ పేరింగ్ మోడ్ ఆప్షన్స్ తో వస్తుంది. ఈ స్పీకర్‌ను 6 నెలల వారంటీతో రిటైల్ స్టోర్స్  ఇంకా ఆన్‌లైన్ స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు.

also read లావా మొట్టమొదటి ఇయర్‌బడ్స్‌.. 25 గంటల బ్యాకప్‌తో వాటర్ రిసిస్టంట్ ప్రూఫ్.. ...

 లాంచ్ గురించి వింగాజాయ్ సహ వ్యవస్థాపకుడు లలిత్ అరోరా మాట్లాడుతూ “మా జూనియర్ టవర్ బ్లూటూత్ స్పీకర్‌ను లాంచ్ చేయడం ద్వారా మా బ్లూటూత్ స్పీకర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.

మ్యూజిక్  లవర్స్ ని దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించాము. ఈ బ్లూటూత్ స్పీకర్  గొప్ప సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. మా కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా ఉండే ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

గత నెల ప్రారంభంలో వింగాజాయ్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ వింగాజాయ్ బిటి -5800ను ప్రవేశపెట్టింది. వింగాజాయ్ బిటి -5800 ధర రూ .2,999 అలాగే 40 గంటల ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. వింగాజాయ్ బిటి -5800లో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి5.0 ఇచ్చారు. అంతేకాకుండా దీనికి మైక్రోఫోన్, కాల్ చేయడానికి హ్యాండ్స్‌ఫ్రీ ఇచ్చారు.

వింగాజాయ్ బిటి -5800 వైర్‌లెస్ / టిఎఫ్ / ఎస్‌డి కార్డ్ / ఆక్స్ తో సహా మల్టీ పేరింగ్ ఆప్షన్ మోడ్‌ ఉంది. వింగాజాయ్ బిటి -5800 360 డిగ్రీల సౌండ్ ఇస్తుందని పేర్కొన్నారు.  ఈ స్పీకర్ చాలా తేలికైనది  ఇంకా డిజైన్ కూడా ఫోల్డబుల్. వింగాజాయ్ బిటి -5800 క్లాసిక్ గోల్డెన్, గ్రీన్, బ్లాక్ రంగులలో విక్రయించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios