హైదరాబాదులో ప్రారంభమైన ఐ ఫోన్ ఎక్స్‌ఎస్, ఐ ఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ డెలివరీ
మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐ ఫోన్ ఎక్స్‌ఎస్ మరియు ఐ ఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ఎట్టకేలకు హైదరాబాద్‌లో డెలివరి ప్రారంభమైంది.
మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐ ఫోన్ ఎక్స్‌ఎస్ మరియు ఐ ఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ఎట్టకేలకు హైదరాబాద్‌లో డెలివరి ప్రారంభమైంది. ఈ రెండు ఫోన్లను ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.
ముందుగా బుకింగ్ చేసుకున్న పిడికిటి జితేంద్ర అందుకున్నారు. గచ్చిబౌలిలోని ఎయిర్‌టెల్ స్టోర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతి ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సీఈవో.. అవనీత్‌సింగ్ ఐ ఫోన్ ఎక్స్ ఎస్ మరియు ఐ ఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్ ఖాతాదారులకు అందించారు.
కొత్త ఐఫోన్ బుకింగ్ చేసుకోవాలనుకునేవారు www.airtel.in/onlinestore ద్వారా బుకింగ్ చేసుకుని 5% కాష్ బ్యాక్ పొందొచ్చు. తొలిసారిగా డ్యూయెల్ సిమ్ కలిగిన ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌మ్యాక్స్‌కు పలు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఐ-ఫోన్ ఎక్స్ ఎస్‌లో 5.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఎక్స్ ఎస్ మ్యాక్స్ లో 6.5 అంగుళాల టచ్ స్క్రీన్, ఎక్స్ ఆర్‌లో 6.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక అత్యాధునిక యాపిల్ బయోనిక్ చిప్ వీటి ప్రత్యేకత.
12 మెగా పిక్సెల్ రియల్ కెమెరా.. 7 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా తో పాటు.. స్టీరియో సౌండర్, బయో మెట్రిక్ ద్వారా ముఖాన్ని గుర్తించే అత్యాధునిక ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి. లేటెస్ట్ ఐ-పోన్ మోడల్స్ అన్నీ 64 జీబీ, 256 జీబీ, 512 జీబీ సామర్థ్యం వరకు మూడు వెరైటీల్లో లభించనున్నాయి. భారత మార్కెట్‌లో ఈ ఫోన్లు రూ.71,800 నుంచి రూ.లక్షా పదివేల ధర పలకనున్నాయి.