Asianet News TeluguAsianet News Telugu

3 ఏళ్లలో అతిపెద్ద ఆర్డీ కేంద్రం హైదరాబాద్ ‘వన్‌ప్లస్’

దేశీయ స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో గణనీయ వాటా పొందుతున్న చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయ తలపెట్టిన ఆర్ అండ్ సెంటర్‌ను మూడేళ్లలో అతిపెద్ద సెంటర్‌గా తీర్చి దిద్దనున్నట్లు సంస్థ సీఈఓ కం కో ఫౌండర్ పీటె లావ్ చెప్పారు. 

India will be our largest R&D base in next 3 years: OnePlus CEO
Author
Mumbai, First Published Dec 3, 2018, 8:28 AM IST

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల కంపెనీ ‘వన్‌ప్లస్’.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను వచ్చే మూడేళ్లలో ప్రపంచంలోనే అతి పెద్దదిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.

దేశంలో భారీగా లభిస్తున్న ఇంజినీరింగ్ నిపుణుల సంఖ్యతో వినూత్న అవిష్కరణలకు హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్ వేదిక అవుతుందని తెలిపింది. ప్రస్తుతం చైనా, తైవాన్, అమెరికాల్లో ఆర్ అండ్ డీ సెంటర్‌లను కలిగి ఉన్న వన్‌ప్లస్ హైదరాబాద్‌లో తన నాలుగో సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు నాలుగు ఆర్‌అండ్‌డీ సెంటర్లలో మొత్తం 700 మంది నిపుణులు పనిచేస్తున్నారు. ‘భారతదేశాన్ని గ్లోబల్ ట్యాలెంట్ హబ్‌గా చూస్తున్నాం. దీర్ఘకాలికి ప్రణాళికతో ఉండాలన్నదే మా అభిమతం.

అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారిని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చి వారిని దీర్ఘకాలంతో పాటు మాతో పని చేసేలా చూడాలనుకుంటున్నాం. మూడు సంవత్సరాల్లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న సెంటర్ అతి పెద్దదిగా రూపొందించాలనుకుంటున్నాం’ అని వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీటె లావ్ తెలిపారు. 

నిపుణుల ఎంపిక కోసం ఐఐటీలతోపాటు టాప్ ఇంజినీరింగ్ కాలేజీలను సంప్రదిస్తున్నట్టు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీటె లావ్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇండియా ఆర్ అండ్ డీ సెంటర్‌లో వంద మంది నిపుణులు పనిచేస్తున్నారు.

కృత్రిమ మేధస్సు తరహా ఆధునిక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలను ఉపయోగించడం ప్రపంచంలో ఉత్తమ సెంటర్‌గా రూపొందించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఆర్ అండ్ డీ సెంటర్ ఎంత మంది నిపుణులను తీసుకోనున్నారన్న అంశంపై వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీటె లావ్  స్పష్టత ఇవ్వలేదు.

మొత్తం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల వాటా వచ్చే ఐదేళ్లలో 15 నుంచి 20 శాతానికి పెరుగడానికి అవకాశాలు ఉన్నాయని పీటే తెలిపారు. భవిష్యత్‌లో మొబైల్ మార్కెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు. 

వన్‌ప్లస్‌కు వచ్చిన మొత్తం ఆదాయంలో భారత్ నుంచి మూడొంతులు సమకూరుతున్నదని వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీటె లావ్ వెల్లడించారు. దీర్ఘకాల దృష్టితో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఇండియా ఆర్ అండ్ డీ టీమ్ నిర్దేశించినట్టు ఆయన తెలిపారు.

టెలివిజన్లను కూడా తయారుచేసే యోచనలో సంస్థ ఉన్నట్టు పీటే తెలిపారు. ప్రీమియం విభాగంలో 30 శాతం వాటాతో దేశీయ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో అగ్రగామిగా వుంది. 28 శాతం వాటాతో శామ్‌సంగ్ రెండో స్థానంలోనూ, 25 శాతం వాటాతో యాపిల్ మూడో స్థానంలో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios