మహిళకు ప్రోత్సాహంతోనే అద్భుతాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

మహిళల్లోని తెలివితేటలను ఉపయోగించుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. పరిశోధనల్లో మహిళా ప్రాతినిధ్యం పెరుగాల్సి ఉందన్నారు.
 

India Needs More Women In Science To Improve Research Quality: Narayana Murthy

పరిశోధనల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనేందుకు అనుకూల వాతావరణ కల్పించి, సైన్స్‌ పరిశోధనల్లో నాణ్యతను పెంచాలని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌ నారాయణ మూర్తి అన్నారు. మహిళల్లో అద్భుతమైన తెలివితేటలు ఉంటాయని, అవి పరిశోధనలకు మరింతగా తోడ్పడతాయన్నారు. 

ఇన్ఫోసిస్‌ వార్షిక అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలోని 4,000 అగ్రశ్రేణి పరిశోధకుల్లో (హైలీ సైటెడ్‌ రీసెర్చర్స్‌) భారతీయులు 10 మంది మాత్రమే ఉన్నారని క్లారివేట్‌ అనలిటిక్స్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపిందన్నారు.

ఇందులో అమెరికాకు చెందిన భారతీయ మహిళ ఒక్కరే అగ్రశ్రేణి జాబితాలో ఉన్నారని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. భారత్‌లో పరిశోధనల్లో నాణ్యత పెంచాలంటే మహిళా పరిశోధకుల తోడ్పాటు తీసుకోవటం తప్పనిసరి.

దేశంలో ఏ విశ్వవిద్యాలయం, ఐఐటీ, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పట్టాలు ప్రదానం చేయటానికి వెళ్లినా అక్కడ పురుషుల కంటే మహిళలు అందుకున్న బంగారు పతకాలు ఎక్కువగా ఉంటాయి.

పరిశోధనలకు అనువైన వాతావరణం సృష్టిస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. వివాహం తర్వాత కూడా పరిశోధనలు చేయడానికి తోడ్పాటు అందించాలి. ప్రతిభ, నైపుణ్యాలు కలిగిన మహిళలకు ఆటంకాలు కలిగించకుండా ఉంటే.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయికి వెళ్లి ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. 
 
మహిళా పరిశోధకుల ప్రోత్సాహానికి ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఐఎ్‌సఎఫ్‌) శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్లు, సోషల్‌ సైంటిస్టులకు అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు మూర్తి తెలిపారు. ఈ ఏడాది కూడా ఆరుగురు ప్రొఫెసర్లకు అవార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు.

వార్షిక అవార్డుల్లో ఒక బంగారు పతకం, ప్రశంసాపత్రం, లక్ష డాలర్ల నగదు ఇన్ఫోసిస్‌ అందజేస్తోంది. ఇన్ఫోసిస్‌ సైన్స్‌ అవార్డులను గెలుచుకున్న పలువురు.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకున్నారన్నారు. పరిశోధనలకు ప్రభుత్వాలు కూడా తోడ్పాటునందించటంతోపాటు భారీగా నిధులు సమకూరుస్తున్నాయని మూర్తి వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios