ఈ ఆఫర్లు అన్ని సర్కిళ్లకూ వర్తిస్తుందని ఐడియా తెలిపింది. దీంతోపాటు ప్రీపెయిడ్ వినియోగదారులకు మరో ఆఫర్‌నూ ప్రకటించింది
ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా మరోసారి ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే మరో టెలికాం సంస్థ వోడాఫోన్ తో ఐడియా విలీనం అయిన సంగతి తెలిసిందే. ఈ విలీనం తర్వాత తొలిసారిగా ఐడియా సరికొత్త ప్లాన్ లను తీసుకువచ్చింది.
ఇందులో భాగంగా రూ.149, రూ.209, రూ.479, రూ.529 ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లలో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్‌తోపాటు, ఎస్‌ఎంఎస్, డేటా ఆఫర్లను కూడా అందించనుంది. ఈ ఆఫర్లు అన్ని సర్కిళ్లకూ వర్తిస్తుందని ఐడియా తెలిపింది. దీంతోపాటు ప్రీపెయిడ్ వినియోగదారులకు మరో ఆఫర్‌నూ ప్రకటించింది. జియోకు పోటీగా రూ.149 రీఛార్జ్‌తో 28రోజుల పాటు ఉచిత వాయిస్‌కాల్స్‌తో పాటు 33జీబీ డేటాను అందిస్తోంది.
రూ.149తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల కాలపరిమితితో 33 జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అదే విధంగా అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సైతం పంపుకొనే వీలుంటుంది.
రూ.209తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా చొప్పున వినియోగించుకోవచ్చు. అదే విధంగా అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సైతం పంపుకొనే వీలుంటుంది.
రూ.479తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా చొప్పున వినియోగించుకోవచ్చు. అదే విధంగా అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను సైతం పంపుకొనే వీలుంటుంది. ఇక రూ.529తో రీఛార్జ్ చేసుకుంటే 1.5జీబీ డేటాతో పాటు, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 90రోజుల పాటు వినియోగించుకోవచ్చు.