దటీజ్ స్పెషల్: ఇండియాలో బెస్ట్ సెల్లర్ ‘రెడ్‌మీ 6ఏ’
భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో జియోమీ ఉత్పత్తి చేసిన ‘రెడ్ మీ 6ఎ’ మోడల్ బెస్ట్ సెల్లర్ ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్ వినియోగదారులు జియో సిమ్ కార్డు కలిగి ఉంటే రూ.2,200 క్యాష్ బ్యాక్ ఆఫర్‌తోపాటు 100 జీబీ అదనపు 4జీ డేటా పొందొచ్చు.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం జియోమీ భారతదేశ మొబైల్ అమ్మకాల్లో మరోసారి తన పత్యేకతను చాటుకుంది. భారత్ మార్కెట్‌లో షావోమి ఉత్పత్తులకు ఉన్న ఆదరణ గురించి అందరికే తెలిసిందే. రెడ్‌మీ 6ఏ విడుదలైనప్పటి నుంచి అత్యుత్తమ విక్రయాలు జరుపుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌గా ఉందని ఐడీసీ తెలిపిందని జియోమీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన రెడ్‌మీ 6ఏ తొలుత ప్లాష్ సేల్‌లో వినియోగదారుడికి అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అన్ని ప్లాట్‌ఫారంలపై రెడ్‌మీ 6ఏ విక్రయాలు అందుబాటులో ఉన్నట్టు సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని ఎంఐ వినియోగదారులతో పంచుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించింది.
దీనిపై జియోమీ సెల్స్ హెడ్ రఘు రెడ్డి స్పందిస్తూ.. ‘రెడ్‌మీ 6ఏ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలవడం చాలా సంతోషాన్ని కలిగించింది. దీనికి కారణమైన ఎంఐ అభిమానులకు కృతజ్ఞతలు. 2014లో తమ సంస్థ విక్రయాలు ప్రారంభించినప్పటి నుంచి.. ఈ ప్రగతి గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఎంఐ అభిమానులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం’ అని తెలిపారు.
సెప్టెంబర్ నుంచి రెడ్ మీ 6ఎ మోడల్ ఫోన్ బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తిగా నిలిచినందుకు తమకు థ్రిల్లింగ్‌గా జియోమీ పేర్కొంది. భారతదేశ మార్కెట్లో రెండు వేరియంట్లలో 2జీబీ సామర్థ్యంతోపాటు 16 జీబీ స్టోరేజీ, 2జీబీ సామర్థ్యంతోపాటు 32 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
2జీబీ ప్లస్ 16 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.5,999, 2జీబీ ప్లస్ 32 జీబీ స్టోరేజీ కెపాసిటీ గల ఫోన్ ధర రూ.6,999లకు అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్ జియో వినియోగదారులు రూ.2,200 క్యాష్ బ్యాక్ ఆఫర్, 100 జీబీ అదనపు 4జీ డేటా పొందొచ్చు.
5.45 అంగుళాల డిస్ ప్లేతోపాటు ఆర్క్ డిజైన్ చేసిన మెటాలిక్ బాడీ కలిగి ఉంటుంది రెడ్ మీ 6ఎ ఫోన్. 2జీబీ రామ్ ప్లస్ 32జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ 12ఎన్ఎం ఫిన్ ఫెట్ హెలియో ఏ22 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. క్రుత్రిమ మేధస్సు ఆధారిత ఫేస్ అన్ లాక్, డ్యూయల్ నానో సిమ్ అండ్ మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ ‘రెడ్ మీ 6ఎ’లో అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి.