ఫ్లిప్‌కార్ట్‌తో టైఅప్: 10లక్షల ఫోన్ల విక్రయం ‘హువాయి’ లక్ష్యం
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హువాయి’ ప్రస్తుత పండుగల సీజన్‌లో భారతదేశంలో 10 లక్షల స్మార్ట్ ఫోన్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఈ- రిటైలర్ ‘ఫ్లిప్‌కార్ట్’ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. హువాయి మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ కూడా తనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ‘హువాయి’ ప్రస్తుత పండుగ సీజన్‌లో ఆశలు భారీగానే పెట్టుకున్నది. ఈ-కామర్స్ వేదిక ‘ఫ్లిప్‌కార్ట్’ నుంచి ప్రస్తుత పండుగ సీజన్‌లో పది లక్షల ‘హోనర్’ స్మార్ట్ ఫోన్లు విక్రయించాలని భావిస్తోంది. మరోవైపు ఆన్‌లైన్ రిటైలర్ ‘ఫ్లిప్‌కార్ట్’ తన ఓవరాల్ విక్రయాల్లో స్మార్ట్ ఫోన్ విక్రయాలు 30 శాతానికి పైగా జరుపాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
హువాయి ఇండియా కన్జూమర్ బిజినెస్ గ్రూప్ ఉపాధ్యక్షుడు పీ సంజీవ్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థ భాగంలో ఫ్లిప్ కార్ట్ వేదికగా 20 లక్షల ‘హోనర్’ స్మార్ట్ ఫోన్లు విక్రయించినట్లు తెలిపారు.
దీంతో ఫ్లిప్ కార్ట్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు పీ సంజీవ్ చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్ కార్ట్ బిలియన్ సేల్స్‌లో 10 లక్షల ‘హోనర్’ స్మార్ట్ ఫోన్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
దీపావళి పండుగ ఆఫర్లను ఈ నెల మూడో తేదీన బయటపెడుతామని హువాయి ఇండియా కన్జూమర్ బిజినెస్ గ్రూప్ ఉపాధ్యక్షుడు పీ సంజీవ్ చెప్పారు. మార్కెట్ అధ్యయన సంస్థ ‘ఐడీసీ’ అంచనా ప్రకారం గతేడాది ద్వితీయార్థంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ప్రథమార్థంలో హోనర్ స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో 281 శాతం వ్రుద్ధి నమోదైంది. ఆన్ లైన్ సెగ్మెంట్‌లో ‘హోనర్’ టాప్ 2 బ్రాండ్ గా కొనసాగుతున్నదని, భారతదేశంలో శరవేగంగా వ్రుద్ధి సాధిస్తున్న బ్రాండ్‌గా పీ సంజీవ్ తెలిపారు.
ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్స్ క్యాటగిరీ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్ రాజగోపాల్ మాట్లాడుతూ తమ ఫెస్టివల్ ఆఫర్ ‘బిగ్ బిలియన్ డే సేల్స్’ ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు సాగుతుందని చెప్పారు. అయితే 11వ తేదీ నుంచి విక్రయాలు మొదలవుతాయని అయ్యప్పన్ రాజగోపాల్ తెలిపారు.
ఈ నెల 10వ తేదీన ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డే సేల్స్ 30 రోజులు కొనసాగుతుందని ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్స్ క్యాటగిరీ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్ రాజగోపాల్ చెప్పారు. ఆన్ లైన్ స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో దాదాపు 65 శాతం వాటా, భారత్ స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో 25 శాతం వాటా సంపాదించామన్నారు.
ప్రస్తుత పండుగ సీజన్‌లో ఆన్ లైన్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ షేర్ 75, భారత స్మార్ట్ ఫోన్ల విక్రయంలో 30 శాతానికి పైగా వాటా పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్స్ క్యాటగిరీ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్ రాజగోపాల్ చెప్పారు.
‘హోనర్ 9ఎన్’ మోడల్ సేల్స్ ప్రధాన ఆకర్షణగా ఉందన్నారు. ఫ్లిప్ కార్ట్ వ్యాప్తంగా ఐదు హోనర్ స్మార్ట్ ఫోన్లు రూ.7000 నుంచి రూ.33 వేల వరకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వీటికి నెలవారీ వాయిదాలపై వడ్డీ అసలే లేదని తేల్చేశారు.