న్యూఢిల్లీ: హువావే సబ్ బ్రాండ్ హానర్ సంస్థ 48 మెగా పిక్సెల్‌తో కూడిన కెమెరాతో నూతన మోడల్ స్మార్ట్ ఫోన్ ‘హానర్ వ్యూ 20’భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నది. హానర్ విడుదల చేయనున్న తొలి పంజ్ హోల్ డిస్ స్లే ఫోన్ ఇదే. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ మంగళవారం నుంచి ఈ- కామర్స్ సంస్థ ‘అమెజాన్ ఇండియా’లో ప్రారంభం అయ్యాయి. 

ఈ నెల 29వ తేదీన దేశీయ మార్కెట్లోకి హానర్ వ్యూ 20 అడుగు పెట్టనున్నది. దాని ధర సుమారు రూ.40 వేలు ఉంటుందని అంచనా. జనవరిలో హానర్ వ్యూ 20 మోడల్ ఫోన్ ఆవిష్కరించనున్నట్లు గతనెలలో హాంకాంగ్ లో జరిగిన హానర్ ఆర్టోలజీ ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ ఫోన్‌లో 1.4జీబీపీఎస్ క్యాట్ 21 మోడెం కూడా డిజైన్ చేశారు. 

ఫస్ట్ ఇన్ స్ర్కీన్ ఫ్రంట్ కెమెరా డిజైన్ చేసిన తొలి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో అభివ్రుద్ది చేసిన ఈ ఫోన్‌లో కంప్యూటింగ్ పవర్, అండ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ పవర్, డ్యూయల్ ఐఎస్పీ, డ్యూయల్ - ఎన్పీయూ, హువావే కిరిన్ 980 చిప్ సెట్ కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది.