హానర్ నుండి 48 మెగాఫిక్సెల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్...నేడే మార్కెట్లోకి
ఇప్పటికే చైనా మార్కెట్లో అడుగు పెట్టిన హువావే సబ్ బ్రాండ్ హానర్ వ్యూ 20 మోడల్ స్మార్ట్ ఫోన్ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నెల 29వ తేదీన భారత మార్కెట్లోకి ఈ ఫోన్ రానున్నది. రెండు వేరియంట్లలో లభించనున్న ఈ ఫోన్ ధర రూ.35,500, రూ.40,600గా ఉంటుంది.
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే సబ్ బ్రాండ్ హానర్ ప్రకటించిన విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లోకి అడుగపెట్టబోతోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన హానర్ వ్యూ20ని ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఆవిష్కరిస్తోంది. అలాగే ఈ నెల 29న భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నది. ఈ- కామర్స్ రిటైల్ దిగ్గజం అమెజాన్ స్టోర్‌లో ప్రత్యేక విక్రయించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌కు ప్రారంభమయ్యాయని కంపెనీ ప్రకటించింది.
అద్భుతమైన ఫీచర్లు, ప్రపంచంలోనే భారీ కెమెరాతో తొలి స్మార్ట్‌ఫోన్‌గా, వ్యూ సిరీస్‌లో టాప్ ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘హానర్ వ్యూ20’ నిలువనున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,500 పలుకుతుండగా, 8జీబీ ర్యామ్ కమ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ. 40,600గా ఉన్నది.
6.4 అంగుళాల డిస్‌ప్లేతోపాటు కిరిన్ 980 ఆక్టాకోర్ సాక్, ఆండ్రాయిడ్ 9, 1080x2310 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉన్నాయి. 48 మెగా పిక్సెల్ రియర్ కెమెరాతోపాటు 6జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ ర్యామ్ నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నది. ఇంకా 25 ఎంపీ సెల్పీ కెమెరా ప్లస్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్నది. ఇప్పటికే చైనా మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. కాగా హానర్ వ్యూ 20 మోషినో రెడ్ ఎడిషన్‌ను లేటెస్ట్‌గా విడుదల చేసింది.