న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే సబ్ బ్రాండ్‌ హానర్‌ సంస్థ మరో మొబైల్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హానర్‌ 10 లైట్‌ అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో కంపెనీ విడదల చేసింది హానర్‌. హానర్‌ 8 లైట్‌, 9 లైట్‌ డివైస్‌ల వరుసలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. డ్యూ డ్రాప్‌ డిస్‌ప్లే, ఏఐ  ఆధారిత 24ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా కానున్నాయి. రెండు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది.

4జీబీ రామ్ వేరియంట్ ఫోన్ రూ.13,999, 6 జీబీ వేరియంట్ ఫోన్ రూ.17,999లకు లభిస్తుంది.  ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయానికి అందుబాటులో ఉంటుంది. మిడ్ నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, స్కై బ్లూ ఆప్షన్లలో లభిస్తాయి. జియో నుంచి కొనుగోలు చేస్తే రూ.2200 క్యాష్‌బ్యాక్‌తోపాటు రూ.2800 క్లియర్‌ ట్రిప్‌ ఓచర్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్‌తోపాటు భారతదేశంలోని ‘హానర్’ స్టోర్లలోనూ ఈ ఫోన్ లభిస్తుంది. కొనుగోలు దారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి కూడా నగదు చెల్లించొచ్చు. 

హానర్‌ 10 లైట్‌లో 6.21 అంగుళాల డిస్‌ప్లేతోపాటు ఆండ్రాయిడ్‌ పై9
ఆక్టాకోర్‌ కిరిన్‌710 ప్రాసెసర్‌ ఉంటాయి. 4 జీబీ అండ్ 6జీబీ ర్యామ్‌ వేరియంట్ మోడల్ ఫోన్లలో 64 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం ఉంటుంది. ఇక 13+2 ఎంపీ రియర్‌ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీ కెమెరాతోపాటు 3400 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది.