మనకు ఉందిలే మంచికాలం: డిజిటల్ పరివర్తనతో బోల్డ్ అవకాశాలు
డిజిటల్ పరివర్తన దిశగా యావత్ ప్రపంచం అడుగులేస్తుండటంతో భారత ఐటీ పరిశ్రమకు దీర్ఘకాలంలో మంచి రోజులు రానున్నాయని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ సంస్థలు జాయింట్ వెంచర్ల దిశగా వెళుతుంటే.. మరికొన్ని ఇతర సంస్థల స్వాధీనంపై కేంద్రీకరించాయన్నారు.
అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు డిజిటల్ టెక్నాలజీ దిశగా పరివర్తన చెందుతున్న తరుణంలో భారత ఐటీ పరిశ్రమ వ్రుద్ధిరేటు పెంచుకునేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
2018 భారత ఐటీ పరిశ్రమకు గడ్డుకాలమని పేర్కొన్నారు. 2016నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగినందు వల్లే ఐటీ రంగానికి గతేడాది ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని తెలిపారు.
2017 ఐటీ రంగం పలు సమస్యలను, సవాళ్లను ఎదుర్కొన్నదని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. 2018లో పతాక శీర్షికల్లో అంతర్జాతీయంగా డిజిటల్ పరివర్తన దిశగా ఐటీ రంగ పరిశ్రమ పెద్దపెద్ద అడుగులేస్తూ ముందుకు సాగుతున్నట్లు వార్తలు వచ్చాయన్నారు.
కానీ ప్రాథమికంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులేయడం వల్ల ఐటీ రంగం నాశనం కాబోదని స్పష్టం చేశారు. ఐటీ పరిశ్రమ, దాని క్లయింట్లను బట్టి పురోగతి ఉంటుందన నాస్కామ్ మాజీ చై్మన్ ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
సమీప భవిష్యత్‌లో దీర్ఘ కాలంగా ఐటీ రంగ మంచి పురోగతి సాధిస్తుందని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ అంచనా వేశారు. ఇది భారతీయ ఐటీ పరిశ్రమకు సానుకూల పరిణామం అని పేర్కొన్నారు.
పలు ఐటీ సంస్థలు జాయింట్ వెంచర్ల నిర్వహణ, కొన్ని సంస్థల స్వాధీనం దిశగా వడివడిగా ముందుకు వెళుతున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారతీయ ఐటీ సంస్థలకు భారీ కాంట్రాక్టులు లభిస్తాయని, తద్వారా ఎంతో పురోగతి ఉంటుందని పేర్కొన్నారు.
2019లో ఐటీ రంగ ఎగుమతులను బట్టే ఈ రంగం పురోగతి ఆధారపడి ఉంటుందని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. ఒకవేళ అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చినా, వ్యవస్థ మందగమనంతో సాగినా.. దాని ప్రభావం భారతీయ ఐటీ పరిశ్రమపైనే పడుతుందన్నారు.
బ్రెగ్జిట్ ప్రభావం కూడా మనపైనే ఉంటుందని తెలిపారు. ప్రత్యేకించి ఐటీ సంస్థల లాభాలు తగ్గుతాయన్నారు. అయితే భారతీ ఐటీ పరిశ్రమ రంగంలో పునాదులు బలంగా ఉన్నాయా? లేదా? అన్న అంశాలే దానికి బలాన్నిస్తాయని ఆర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.