Asianet News TeluguAsianet News Telugu

అందుబాటులోకి ‘గూగుల్ షాపింగ్’ ఆన్ లైన్ సేవలు

ఇప్పటి వరకు ఇంటర్నెట్‌లో ఏదైనా కావాలంటే ‘సెర్చింజన్’ గూగుల్ శరణ్యం.. కానీ ఇటీవల అమెజాన్, ఫ్లిప్ కార్ట్ - వాల్ మార్ట్ తదితర ఆన్ లైన్ రిటైల్ సంస్థలు గూగుల్ సాయంతో తమ వ్యాపారం విస్తరిస్తున్నాయి. ఇతర డిజిటల్ పే మెంట్ బ్యాంకులతోపాటు ఆన్ లైన్ షాపింగ్ వసతులను అందుబాటులోకి తెచ్చి తమ ఖాతాదారులను నిలుపుకోవాలని సెర్చింజన్ గూగుల్ తలపెట్టింది

Google launches a new Shopping Homepage for Indian users
Author
Delhi, First Published Dec 14, 2018, 8:51 AM IST

భారతదేశంలో పెరుగుతున్న ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఆదరణను తమకు అనువుగా మార్చుకున్న నేపథ్యంలో సెర్చింజన్ ‘గూగుల్‌’ కూడా ఈ రూట్‌లోకి దూసుకొచ్చింది. తాజాగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వ్యాపారంలోకి ప్రవేశించింది. దేశంలో ‘గూగుల్‌ షాపింగ్‌’ పేరుతో కొత్త షాపింగ్‌ ప్లాట్‌ఫాం గురువారం ప్రారంభించింది.

తక్షణం ‘గూగుల్ షాపింగ్‌ పోర్టల్‌’ అందుబాటులోకి వచ్చిందని గూగుల్‌  ప్రకటించింది. ఇందులో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు తదితర విభాగాలలో ఉత్పత్తులను వికయించనున్నది.  వివిధ కంపెనీల, బ్రాండ్ల ఉత్పత్తులను ‘గూగుల్‌ షాపింగ్‌ పోర్టల్‌’లో అందుబాటులో ఉంచింది.

వినియోగదారులు సరైన ఉత్పత్తులు, విక్రయించే రిటైలర్ల సమాచారం తెలుసుకోవడంలో సాయపడేలా గూగుల్ షాపింగ్  పోర్టల్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ భాషలోలో ధరలు, బెస్ట్‌డీల్స్‌ తదితర సమాచారం తెలుసుకునే వీలు కల్పించామని పేర్కొన్నది. 

లక్షల మంది ఆన్‌లైన్ వినియోగదారులకు ఉత్పత్తులను విక్రయించుకునేందుకు రీటైల్‌ వ్యాపారులకు ఇది గొప్ప అవకాశమని గూగుల్ షాపింగ్  ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురోజిత్ చటర్జీ బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. అలాగే డెస్క్‌టాప్‌తోపాటు ఎంట్రీ లెవల్  మొబైల్స్‌లోనూ పనిచేసేలా ఒక  ప్రోగ్రెసివ్‌ వెబ్‌యాప్‌ను త్వరలోనే లాంచ్‌ చేస్తామన్నారు.

కాగా దేశంలో 40 కోట్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు ఉండగా వీరిలో కేవలం మూడవ వంతు  వినియోగదారులు అసలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం లేదని గూగుల్‌ పేర్కొంది. తమ గూగుల్‌ షాపింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ప్రోత్సాహం అందిస్తూ, చిన్న,మధ్య తరహా వ్యాపారులను ఆన్‌లైన్‌ బిజినెస్‌లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios