చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో మరో సరికొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ‘న్యూ ఫోన్-న్యూ ఇయర్’ పేరుతో ఎంపిక చేసిన మొబైల్స్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. 

ఈఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లలో దేనినైనా కేవలం రూ. 101 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మిగతా సొమ్ము ఆరు సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఆఫర్‌లో భాగంగా వివో నెక్స్, వివో వీ11, వివో వీ11 ప్రొ, వివో వై95, వివో వై83 ప్రొ, వివో వై81-4జీ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచింది.

ఈ నెల 20వ తేదీనే ప్రారంభమైన ఈ ఆఫర్ వచ్చేనెలాఖరు వరకు అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని అథరైజ్‌డ్ ఔట్‌లెట్లలోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
 
ఇదీ ఫైనాన్సింగ్ వసతి.. కానీ షరతులు వర్తిస్తాయి
బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీబీ, క్యాపిటల్‌ ఫస్ట్‌ లాంటి సంస్థల ద్వారా ఫైనాన్సింగ్‌ వసతి ఉంది. ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. ఈ ఆఫర్‌కు సాధారణ ఈఎంఐ ఆఫర్ వర్తించదు. ప్రాసెసింగ్ రుసుము కింద రూ. 399 చెల్లించాలి. రూ. 10 వేలు అంతకంటే ఎక్కువ ధర కలిగిన వివో ఫోన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
 
మీరు ఇలా వివో ఫోన్ స్టోర్‌లో ఆఫర్లు పొందొచ్చు.. 
సమీపంలోని ఏదైనా వివో స్టోర్‌కు కేవైసీ డాక్యుమెంట్లు, అంటే.. పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు వంటి వాటిని తీసుకుని వెళ్లాలి. ఆఫర్‌లో ఉన్న ఫోన్లలో మనకు నచ్చిన ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి. రూ.101 చెల్లించి కేవైసీ డాక్యుమెంట్లు ఇవ్వాలి.

తర్వాత ఫోన్ మొత్తాన్ని ఆరు సమాన భాగాలుగా విభజిస్తారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఆరు సులభ వాయిదాల్లో చెల్లించాలి. అంతే.. కొత్త ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లి ఎంజాయ్ చేయడమే. ఈ ఆఫర్‌కు అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ జీరో డౌన్ పేమెంట్ ఆఫర్, డెబిట్, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై రూ. 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించింది.