Asianet News TeluguAsianet News Telugu

కాలింగ్ ఫీచర్‌తో ఫైర్-బోల్ట్ కొత్త స్మార్ట్‌వాచ్.. 5వేల లోపు తక్కువ ధరకే..

ఫైర్-బోల్ట్ టోర్నడో ధర రూ. 4,999 దీనిని ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. ఫైర్-బోల్ట్ టోర్నాడో 320x380 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.72-అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది.
 

Fire Bolt Tornado Smartwatch Launched With Calling Feature, Price Less Than Five Thousand
Author
Hyderabad, First Published May 19, 2022, 5:18 PM IST

దేశీయ కంపెనీ ఫైర్-బోల్ట్(Fire-Bolt)కొత్త స్మార్ట్ వాచ్ ఫైర్-బోల్ట్ టోర్నాడోను కాలింగ్ ఫీచర్‌తో లాంచ్ చేసింది. వాచ్ పేరును టోర్నాడో కాలింగ్ అని కూడా పెట్టారు. Fire-Bolt Tornado ధర రూ. 4,999 దీనిని ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. ఫైర్-బోల్ట్ టోర్నాడో 320x380 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.72-అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది.

క్విక్ డయల్‌ప్యాడ్ కాకుండా ఫైర్-బోల్ట్ టోర్నాడో లో కాల్ హిస్టరీ, సింక్ కాంటాక్ట్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫైర్-బోల్ట్ టోర్నాడో బ్లాక్, గ్రే, బ్లూ, గ్రీన్ ఇంకా రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ వాచ్‌లో 30 స్పోర్ట్స్ మోడ్‌లు ఇచ్చారు. 

అంతేకాకుండా SPO2 మానిటర్, హార్ట్ రేట్ ట్రాకర్, శ్వాస, స్త్రీ ఆరోగ్య సంరక్షణ, త్రాగునీటి రిమైండర్ వంటి హెల్త్ ఫీచర్స్ ఉన్నాయి. వాటర్ రెసిస్టెంట్ కోసం దీనికి IP67 రేటింగ్ వచ్చింది అంటే ఈ వాచ్ అరగంట పాటు నీటిలో ఉన్నా కూడా పాడవదు. ఇందులో మీరు ఫోన్‌లోని మ్యూజిక్ కూడా సీన్ చేయవచ్చు. దీని బ్యాటరీకి సంబంధించి 7 రోజుల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది.

ఫైర్-బోల్ట్ నింజా2ప్లస్, ఫైర్-బోల్ట్ హరికేన్ అనే రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేయడం ద్వారా గత నెల ప్రారంభంలోనే ఫైర్-బోల్ట్  స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. వీటిలో ఫైర్-బోల్ట్ నింజా 2 ప్లస్ నింజా సిరీస్‌లో కొత్త వాచ్ కాగా, ఫ్యాషన్ ప్రియుల కోసం ఫైర్-బోల్ట్ హరికేన్ పరిచయం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios