Asianet News TeluguAsianet News Telugu

లైఫ్ స్టైల్ వల్లే బెంగళూరు ఐటీకి రూ.24 వేల కోట్ల నష్టం

ఉద్యోగుల అనారోగ్యం, శారీరక శ్రమ రాహిత్యం, మానసిక ఉద్వేగం తగ్గిపోయి.. దాని స్థానే మానసిక ఒత్తిడి పెరడగం, క్రమశిక్షణలేని జీవన శైలి తదితర కారణాలతో భారత సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఏటా ఐటీ పరిశ్రమకు 24 వేల కోట్ల రూపాయల రాబడి తగ్గుతోందని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ సంస్థ తేల్చింది. 

Employee lifestyle costs $3.5 billion loss for Bengalurus IT sector
Author
New Delhi, First Published Dec 23, 2018, 11:10 AM IST

న్యూఢిల్లీ: ఉద్యోగుల అనారోగ్యం, శారీరక శ్రమ రాహిత్యం, మానసిక ఉద్వేగం తగ్గిపోయి.. దాని స్థానే మానసిక ఒత్తిడి పెరడగం, క్రమశిక్షణలేని జీవన శైలి తదితర కారణాలతో భారత సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఏటా ఐటీ పరిశ్రమకు 24 వేల కోట్ల రూపాయల రాబడి తగ్గుతోందని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ సంస్థ తేల్చింది. బెంగళూరులోని పది పెద్ద ఐటీ కంపెనీలలోని 500 మంది ఉద్యోగులను ఇంటర్వ్యూ చేయడంతో ఈ సంగతి బయటపడింది. 

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఇన్ఫోసిస్, విప్రో, మైండ్‌ట్రీ లాంటి భారతీయ కంపెనీలకు ప్రపంచ హెడ్‌ క్వార్టర్లు ఇక్కడ ఉన్ాయి. ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీల భారతీయ ప్రధాన కేంద్రాలు బెంగళూరులోనే పరివేష్టితమయ్యాయి.

భారత దేశమంతటా ఐటీ పరిశ్రమలో 165 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతుండగా, ఒక్క బెంగళూరులోనే ఏటా 50 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. ఉద్యోగుల శారీరక, మానసిక అనారోగ్యం, అపసవ్య జీవన శైలి తదితర కారణాలతో నగరంలోని మొత్తం రెవెన్యూలో ఏడు శాతం నష్టపోతున్నారు. 

30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులకే ఎక్కువగా అనారోగ్య అలవాట్లు, అనారోగ్య జీవన శైలి ఉందని, నష్టపోతున్న ఆదాయంలో 42 శాతం వాటా వీళ్ల వల్లే జరుగుతున్నదని ఈ అధ్యయనం తేల్చింది. యువతీ యువకులు వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శారీరక బలహీనత సమస్యలు తలెత్తుతుంటే పెద్ద వారికి సరైన వ్యాయామం.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల బలహీనతలకు గురవుతున్నారు.

ఇదివరకు ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఉల్లాసానికి అట పాటలకు క్యాంపస్‌లోనే సౌకర్యాలు ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశమ్రలో మాంద్యం లాంటి పరిస్థితులు ఏర్పడడంతో పొదుపు చర్యల్లో భాగంగా కంపెనీల యాజమాన్యాలు ఈ సౌకర్యాలను తొలగించాయి. 

ఇదివరకు ఉద్యోగుల కోసం పని చేసే ‘ఫిజికల్‌ ఫిట్‌నెస్‌’ సిబ్బంది కూడా కాలక్రమంలో కనిపించకుండా పోయారు. ఉద్యోగులే వారంతట వారే తమ మానసిక ఒత్తిడి తగ్గింపునకు ‘మెడిటేషన్‌’ లాంటి విద్యలు ప్రాక్టీస్‌ చేస్తున్నారని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios