బీజింగ్: చైనా కంపెనీలు హువావే ఫోన్లు కొనుక్కోవడానికి తమ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సబ్సిడీలు ప్రకటించాయి. దానిలో అమెరికా వ్యతిరేకత ప్లస్ చైనా పట్ల దేశభక్తి దాగి ఉంది. డిసెంబర్ ఒకటో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ తేదీన హువావే ఛీఫ్ ఫైనాన్సింగ్ అధికారి మెంగ్ వాంగ్ జూను కెనడాలో అరెస్ట్ చేయడమే అందుకు కారణం. హువావేతో పాటు మరికొన్ని కంపెనీలు కూడా ఆ ఫోన్లు కొనడానికి ఈ సబ్సిడీలను అందిస్తున్నాయి. అలాగే మరికొన్ని కంపెనీలు అమెరికాకు చెందిన యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న ఉద్యోగులకు గట్టి హెచ్చరికలు చేస్తున్నాయి. సబ్సిడీలతో లాభపడిన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించాయి.

‘మేడిన్‌ చైనా బ్రాండ్లకు మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ సబ్సిడీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. కేవలం ఉద్యోగుల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. యాపిల్ ఫోన్‌ కొనుగోలు చేసే ఉద్యోగులకు జరిమానా విధిస్తామని కొన్ని కంపెనీలు ఉద్యోగులను హెచ్చరించాయి. ఆ జరిమానా కింద యాపిల్ ఫోన్‌ మార్కెట్ ధరను వసూలు చేస్తామని వారికి వెల్లడించాయి.

చైనీయుల్లో ఈ దేశభక్తి ఒక్కసారిగా వెల్లువెత్తడానికి కారణం..హువావే ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ మెంగ్ వాంగ్‌జౌను అదుపులోకి తీసుకోవడమే. నేరస్థుల అప్పగింత ఒప్పందంలో భాగంగా అమెరికా చేసిన అభ్యర్థన మేరకు కెనడా డిసెంబర్ ఒకటో తేదీన ఆమెను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆమె బెయిల్‌ మీద విడులైనా విచారణ జరుగుతోంది. ఆమెను వాంకోవర్‌లో ఒక విలాసవంతమైన ఇంట్లో నిఘా నీడలోఉంచారు.

ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ ఆ దేశంతో వాణిజ్య కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణంతో అమెరికా ఈ చర్యకు పూనుకుంది. ఆమెను అరెస్ట్ చేయడం వెనుక ఎటువంటి రాజకీయ కారణం లేదని కెనడా పదే పదే వెల్లడించింది. అయితే ఆమె అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర ఉందని చైనా ఆరోపిస్తుంది.

చైనాకు చెందిన హైటెక్‌ కంపెనీలను అణచి వేయడానికే అమెరికా ఈ కుట్రలు చేస్తుందని ఆ దేశ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. దేశభక్తి పేరిట సబ్సిడీలను ప్రకటించడం వ్యాపారంలో భాగమని విమర్శలు వస్తున్నాయి.