ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరోసారి ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. అయితే ఈ ఆఫర్లు కేవలం అసుస్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ లపై మాత్రమే.  ఫ్లిప్ కార్ట్ లో అసుస్ ఇండియా ‘‘ అసుస్ డేస్’’ పేరిట ప్రత్యేక సేల్ ని ప్రారంభించింది. ఈ సేల్ రేపటి వరకు కొనసాగనుంది.

ఇందులో పలు ఆసుస్ స్మార్ట్ ఫోన్ లపై భారీ ఆఫర్లు ప్రకటించారు. సేల్‌లో భాగంగా అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్ (8జీబీ, 256 జీబీ) రూ.8వేల త‌గ్గింపుతో రూ.28,999 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.8వేల త‌గ్గింపుతో రూ.24,999 ధ‌ర‌కు, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.1వేయి తగ్గింపుతో రూ.12,999 ధ‌ర‌కు అందిస్తున్నారు.

 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధ‌ర‌కు, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.8,999 ధ‌ర‌కు, అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1 రూ.4,999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. వీటికి త‌క్కువ ధ‌ర‌కే మొబైల్ ప్రొటెక్ష‌న్ ప్లాన్‌ను కూడా అందిస్తున్నారు.