Asianet News TeluguAsianet News Telugu

శామ్‌సంగ్, యాపిల్ సంస్థలకు షాకిచ్చిన 2018

గతేడాది స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 4.1 శాతం తగ్గుముఖం పట్టినా చైనా దిగ్గజం హువావే అదరగొట్టింది. ఇక కస్టమర్ల ఆకాంక్షలు, ప్రయోజనాలకు భిన్నంగా ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిన శామ్‌సంగ్, యాపిల్ ‘ఐ-ఫోన్’ విక్రయాలు భారీగా పతనం అయ్యాయి. 

Apple, Samsung smartphone shipments slip
Author
Hyderabad, First Published Feb 4, 2019, 2:49 PM IST

గతేడాది టెక్నాలజీ రంగం పలు ఒడుదొడుకులను ఎదుర్కొంది. ప్రముఖ ఐ ఫోన్‌ల తయారీ సంస్థ ఆపిల్‌ వ్యాపారం కూడా ఆశించిన రీతిలో వృద్ధిని నమోదు చేయలేదు. స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లలో యాపిల్‌, శాంసంగ్‌లకు గతేడాది అత్యంత చెత్త ఏడాదని ఇటీవల అధ్యయన సంస్థ ‘ఐడీసీ’ గణాంకాలు నిర్ధారించాయి. 

ఈ రెండు సంస్థలు కూడా కస్టమర్ల ప్రయోజనాలు, ఆసక్తి, అంచనాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందుబాటులోకి తేవడంలో విఫలం అయ్యాయని ఐడీసీ నివేదిక సారాంశం. 2018లో 1.4 బిలియన్ల స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జరిగాయని ఐడీసీ పేర్కొంది. 

స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీలో 2018లో జరిగిన స్మార్ట్ ఫోన్ విక్రయాలను పరిగణనలోకి తీసుకుంటే అంచనాల కన్నా 4.1శాతం తక్కువ అని ఐడీసీ తెలిపింది. నిత్యం కొత్త మోడల్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో పురోగతి రికార్డు అవుతుందన్న అంచనాలకు భిన్నంగా విక్రయాలు తగ్గిపోవడం గమనార్హం.

2014లోనే ఈ సంఖ్యను స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీ దాటింది. 2018 నాలుగో త్రైమాసికంలోనూ స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్‌ 4.9%గా నమోదైంది. 2017 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే, 2018లో ఐఫోన్‌ ఆదాయం 15 శాతం తగ్గింది. 

చైనాలో ఆర్థిక మందగమనం కూడా ఐఫోన్‌ అమ్మకాలపై పడిందని సీఈవో టిమ్‌కుమ్‌ తెలిపారు. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం కూడా దీనికో కారణం అన్న అభిప్రాయం ఉన్నది. దీంతోపాటు, డాలర్‌ బలపడటం, సబ్సిడీల తగ్గింపు, యాపిల్‌ బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌లు కూడా ఐఫోన్ల విక్రయాలు తగ్గిపోవడానికి కారణం అయ్యాయి.

యాపిల్ విక్రయాలు కూడా డిసెంబర్ నెలతో ముగిసిన చివరి త్రైమాసికంలో 11.5 శాతం తగ్గుముఖం పట్టాయి. మరోవైపు శామ్ సంగ్ సేల్స్ కూడా 5.5 శాతం పడిపోయాయి.కానీ మిగతా స్మార్ట్ ఫోన్ల విక్రయాలేవీ ఇంతగా పడిపోలేదు. 

దద్భిన్నంగా చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే సేల్స్ 33.6 శాతం పెరిగాయి. గతేడాది స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో హువావే అగ్రస్థానంలో నిలిచింది.  షామీ, ఒప్పోలు విక్రయాలు కూడా వృద్ధిని నమోదు చేశాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios