యాపిల్ నుంచి కొత్తగా మూడు స్మార్ట్‌ఫోన్లు

అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ యాపిల్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది తమ కంపనీ నుండి దాదాపు మూడు కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అందుకోసం కసరత్తు కూడా ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 
 
Apple plans to launch three new iPhones this year

అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ యాపిల్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది తమ కంపనీ నుండి దాదాపు మూడు కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అందుకోసం కసరత్తు కూడా ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 

ఉన్నత వర్గాలు, సెలబ్రిటీలు, బిజినెస్ పీపుల్స్ ని దృష్టిలో పెట్టుకుని యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులను రూపొందిస్తుంది. అదే బాటలో ఈ స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. అధిక ధరలతొ లభించే ఫోన్లలో వెనుక వైపు మూడు కెమెరాలు, తక్కువ ధరల్లో అందించే ఫోన్లలో రెండు కెమెరాలను అమర్చనున్నట్లు యాపిల్ తెలిపింది. అలాగే అత్యుత్తమ ఫీచర్లతో కూడిన కెమెరాను  అందించనున్నట్లు ప్రకటించారు. 

ఇక భవిష్యత్ లో ఎల్‌సిడి డిస్ ప్లే స్థానంలో  ఓఎల్ఈడి(ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్  డయోడ్) తో కూడిన డిస్ ప్లే లను యాపిల్ ఫోన్లలో వాడనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. 2020 కల్లా ఓఎల్ఈడీ తెరతో కూడిన ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది. ఎల్‌సిడి తో పోలిస్తే ఓఎల్ఈడి విధానంలో స్పష్టత ఎక్కువ ఉంటుందనే దాన్ని వాడాలని నిర్ణయించుకున్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios