'జూమ్' యాప్‌కు కలిసొచ్చిన లాక్ డౌన్..తక్కువ సమయంలోనే మిలియన్ల యూజర్లు
దేశవ్యప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రైవేట్ కంపెనీలు 'వర్క్ ఫ్రమ్ హోం' ఆదేశించాయి. దీంతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, కంపెనీల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్సుల కోసం ఎక్కువగా 'జూమ్' యాప్‌ను వినియోగిస్తున్నారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దేశప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ప్రపంచం మొత్తంలో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఈ వైరస్ సోకి చాలా మరణించారు కూడా. దీని వ్యాప్తిని నియంత్రించడానికి ఆగ్రా దేశాలతో సహ భారతదేశంలో కూడా లాక్ డౌన్ అమలు చేశారు.
దేశవ్యప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రైవేట్ కంపెనీలు 'వర్క్ ఫ్రమ్ హోం' ఆదేశించాయి. దీంతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, కంపెనీల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్సుల కోసం ఎక్కువగా 'జూమ్' యాప్‌ను వినియోగిస్తున్నారు.
ఐతే ఈ జూమ్ యాప్ సురక్షితమైనది కాదని, అందులో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని తెలిసినా చాలా మంది ఈ యాప్‌నే ఎక్కువగా వాడుతున్నారు.
ఏప్రిల్‌లో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్‌ను రోజువారీ వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జూమ్ యాప్‌కు మార్చిలో 200 మిలియన్ల ఉన్న యూజర్లు గత రెండు, మూడు వారాల్లోనే 300 మిలియన్లకు చేరుకున్నారు.
గతేడాది డిసెంబర్‌లో రోజువారీ వినియోగదారులు కేవలం 10 మిలియన్లు మాత్రమే కలిగిన జూమ్ పలు దేశాల్లో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి వరకు ఆ సంఖ్య 200 మిలియన్లకు పెరగడం విశేషం. ప్రతిరోజు 300 మిలియన్ డైలీ యూజర్లు యాప్‌ను వాడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
వర్చువల్ సమావేశాల సమయంలో అశ్లీల కంటెంట్ తెరపైకి రావడం, వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ యాప్ వినియోగం పెరగడం గమనార్హం. లాక్ డౌన్ సమయంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడం, వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఉద్యోగులు జూమ్ యాప్ ఎంచుకుంటున్నారు.