Asianet News TeluguAsianet News Telugu

అచ్చం టిక్‌టాక్‌లాగే యూట్యూబ్ సరికొత్త ఫీచర్..

చైనా ఉత్పత్తులు, చైనా యాప్స్ పై నిషేధించాలంటు  ప్రచారం ఊపందుకున్న సమయంలో యూట్యూబ్ వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు యూట్యూబ్  కొత్త ఫీచర్‌తో రాబోతోంది. 

YouTube targets china app TikTok with new 15-seconds video recording feature
Author
Hyderabad, First Published Jun 27, 2020, 4:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూ ఢిల్లీ: గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ టిక్‌టాక్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది, ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్‌ఫాంపై ఇప్పుడు గరిష్టంగా 15 సెకన్ల వరకు వీడియోలను రికార్డు చేసి పోస్ట్ చేసేందుకు టెస్టింగ్ ప్రారంభించింది.

15-సెకన్ల వీడియో ఫార్మాట్‌తో పాపులర్ అయిన టిక్‌టాక్ లాగే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఎక్కువగా దీనిని ప్రయత్నిస్తున్నాయి. చైనా ఉత్పత్తులు, చైనా యాప్స్ పై నిషేధించాలంటు  ప్రచారం ఊపందుకున్న సమయంలో యూట్యూబ్ వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు యూట్యూబ్  కొత్త ఫీచర్‌తో రాబోతోంది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్ తరహాలో స్టోరీస్ అప్‌డేట్ ఫీచర్‌ రీల్స్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ వంటి కొన్ని దేశాలలో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. మ్యూజిక్ లేదా ఇతర ఆడియోలతో సెట్ చేసిన 15-సెకన్ల చిన్న వీడియో క్లిప్‌లను రికార్డ్ చేయడానికి ఇంకా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి అనుమతిస్తుంది.

ఈ వారంలో 15 సెకన్ల వీడియో ఫార్మాట్‌ని ప్రయత్నిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది, దీనిని షార్ట్స్ అని పిలుస్తారు. టిక్‌టాక్‌ లాంటి యాప్‌ను యూట్యూబ్ త్వరలో తీసుకురానుందని ఏప్రిల్ నెలలో పలు నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ఫీచర్లను అనుకరించడం యూట్యూబ్‌కి ఇదే మొదటిసారి కాదు.  

అయితే టిక్‌టాక్ మాదిరిగా ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ లభిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. టిక్‌టాక్ లేదా ఇతర ఆధునిక చిన్న వీడియో యాప్ లలో కూడా వీడియో కంటెంట్ లిమిట్ ఎక్కువ ఉండటంతోపాటు, ఏఆర్ ఎడిటింగ్ ఎఫెక్టులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

also read  ఒక్క రోజులో 53 వేల కోట్లు నష్టపోయిన ఫేస్‌బుక్... ...

ఈ నేపథ్యంలో యూట్యూబ్ దీన్ని మరింత మెరుగుపర్చకపోతే, స్టోరీస్ ఫీచర్ లాగా మరచిపోవడం ఖాయమని టెక్ పండితులు భావిస్తున్నారు.ఒక చిన్న గ్రూప్ వ్యక్తులతో మొబైల్‌ ద్వారా  ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ రెండింటిలో ఈ టెస్టింగ్ ప్రారంభమయ్యింది.

"యూట్యూబ్ క్రెయేటర్స్ కోసం యూట్యూబ్ మొబైల్ యాప్ లో నేరుగా  రికార్డ్ చేయడానికి, మల్టీ క్లిప్‌లను సులభంగా అప్‌లోడ్ చేయడానికి మేము ఒక  కొత్త మార్గాన్ని పరీక్షిస్తున్నాము. ఒకవేళ మీరు ఈ టెస్టింగ్ లో ఉన్నట్లయితే, మీరు 'క్రియేట్ వీడియొ' అనే ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది" అని యూట్యూబ్‌కు సమాచారం ఇచ్చింది.

ఈ కొత్త ఫీచర్ ఉపయోగించడానికి, టెస్టింగ్ లో ఉన్న వారు, వారి మొదటి క్లిప్‌ను రికార్డ్ చేయడానికి రికార్డ్ బటన్‌ను నొక్కి పట్టుకోవాలి, రికార్డింగ్ ఆపడానికి బటన్‌ పై నుండి మీ చెయ్యి తీస్తే రికార్డింగ్  ఆగిపోతుంది. "మీరు గరిష్టంగా 15 సెకన్ల వరకు లేదా మీరు పెద్ద వీడియోను అప్‌లోడ్ చేయాలనుకుంటే, రికార్డ్ చేయడానికి బదులు మీ ఫోన్ గ్యాలరీ నుండి అప్‌లోడ్ చేయవచ్చు అని యూట్యూబ్ తెలిపింది.

వాయిస్ సెర్చ్ కోసం మాన్యువల్ లాంగ్వేజ్ సెలెక్టర్‌ టెస్టింగ్ కూడా ప్రారంభించినట్లు యూట్యూబ్ గురువారం తెలిపింది. "యూట్యూబ్ వాయిస్ సెర్చ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, మీ యాప్ సెట్టింగ్‌లలో ప్రస్తుతం సెట్ చేసిన బాషలకంటే ఇతర వేరే భాషలను కూడా ఎంచుకోవడానికి ఒక మార్గాన్ని పరీక్షిస్తున్నాము" అని తెలిపింది.

ఈ టెస్టింగులో పంజాబీతో సహా పలు ప్రాంతీయ భాషలను కూడా జోడించనుంది. ఈ టెస్టింగ్ పై ఫీడ్ బ్యాక్ కోసం యూట్యూబ్  ఒక చిన్న గ్రూప్ వ్యక్తులతో కొంత కాలానికి పనిచేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios