Asianet News TeluguAsianet News Telugu

రెడ్ మీ నోట్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ సమస్య మీకు ఉండొచ్చు..

అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై కొంతమంది యూజర్లు కెమెరా మాడ్యూల్ దుమ్ము చేరి కెమెరా పనికిరాకుండా మారిందని ఫిర్యాదు చేస్తున్నారు. యూసర్లు కెమెరాలో చేరిన దుమ్ము ఫోటోలను కూడా  సోషల్ మీడియా ట్విట్టర్ లో షేర్ చేశారు.

xiaomi Redmi Note 9, Redmi Note 9 Pro may have a dust problem
Author
Hyderabad, First Published Aug 24, 2020, 12:03 PM IST

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ రెడ్ మీ గత కొన్ని రోజుల క్రితం రెడ్ మీ నోట్ 9 ప్రొ, నోట్ 9 ప్రొ మ్యాక్స్ ఆవిష్కరించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై కొంతమంది యూజర్లు కెమెరా మాడ్యూల్ దుమ్ము చేరి కెమెరా పనికిరాకుండా మారిందని ఫిర్యాదు చేస్తున్నారు.

యూసర్లు కెమెరాలో చేరిన దుమ్ము ఫోటోలను కూడా  సోషల్ మీడియా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పటివరకు రెడ్‌మి నోట్ 9, రెడ్‌మి నోట్ 9 ప్రో యూనిట్లు ఎక్కువగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.

also read వాట్సాప్ కొత్త ఫీచర్.. గ్రూప్ కాల్స్ కోసం కొత్త రింగ్‌టోన్.. ...

కొంతమంది రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ యూజర్లు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. షియోమికి ఈ సమస్య గురించి కూడా తెలుసు.

షియోమి ఇండోనేషియా జనరల్ మేనేజర్ ఆల్విన్ త్సే కొన్ని నెలల క్రితం వినియోగదారుల నుండి ఇలాంటి ఫిర్యాదులు అందుకున్నట్లు ధృవీకరించారు. ఇలాంటి కేసులను నివారించడానికి నాణ్యత నియంత్రణను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

షియోమి సర్వీస్ సెంటర్లో కెమెరా  సమస్యను పరిష్కరిస్తాయని  ఆయన తెలిపారు. భారతదేశంలో కూడా, షియోమి  రెడ్‌మి నోట్ 9 సిరీస్ అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్, మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హార్డ్‌వేర్‌ సంబంధించినది, దీనిని పరిష్కరించడం చాలా కష్టం.
 

Follow Us:
Download App:
  • android
  • ios