అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఛార్జర్ ఇంకా ఇయర్‌ఫోన్‌లు లేకుండా ఐఫోన్ 12 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే, అయితే ఛార్జర్, ఇయర్‌ఫోన్‌లు లేకుండా ఆపిల్ ఫోన్ లను విక్రయించడం పై ఇతర మొబైల్ కంపెనీలు ఎగతాళి చేశాయి.

శామ్‌సంగ్ కూడా సోషల్ మీడియాలో దీనిపై ఒక పోస్ట్ కూడా పెట్టింది కానీ దాన్ని వెంటనే  తొలగించింది, శామ్‌సంగ్ చేసిన పోస్టులో ఛార్జర్ లేకుండా ఐఫోన్‌ను అందించడం పై ఎగతాళి చేస్తున్నట్టు ఉంది. కొద్ది రోజుల క్రితం ఛార్జర్ లేకుండా ఫోన్‌ను లాంచ్ చేయడానికి శామ్‌సంగ్ కూడా సిద్ధమవుతోందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పుడు తాజాగా  షియోమి కూడా ఆపిల్,  శామ్‌సంగ్ సంస్థల మార్గాన్ని అనుసరించబోతోంది. ఒక నివేదిక ప్రకారం, షియోమి సంస్థ నుండి రాబోయే కొత్త ఫోన్ షియోమి ఎం‌ఐ 11ను ఛార్జర్ లేకుండా లాంచ్ చేయవచ్చు అని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

also read ఈ ఏడాది 2020లో లాంచ్ అయిన బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే.. ...

షియోమి స్మార్ట్ ఫోన్ బాక్స్ ఫోటో లీక్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది, దీని ప్రకారం షియోమి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ నుండి ఛార్జర్‌ను తొలగిస్తోంది. షియోమి ఎం‌ఐ 11 లాంచ్ డిసెంబర్ 28న   కానుంది.

షియోమి స్మార్ట్ ఫోన్ బాక్స్ లీక్ అయిన ఫోటోతో  ఐఫోన్ 12 బాక్స్, షియోమి ఎం‌ఐ 11 బాక్స్ పోల్చి చూడవచ్చు. బాక్స్  మందాన్ని పరిశీలిస్తే, ఎం‌ఐ 11 బాక్స్‌లో ఛార్జర్ లేనట్లు అంచనా వేయబడింది.

ఆపిల్ ఐఫోన్‌లతో ఛార్జర్‌లను అందించకూడదని ఆపిల్ తీసుకున్న నిర్ణయం ఫ్రాన్స్ మినహా అన్ని దేశాలలో ప్రభావవంతంగా ఉంటుంది, కానీ ఇప్పుడు బ్రెజిల్‌లో ఆపిల్ ఫోన్‌లతో ఛార్జర్‌లను అందించవలసి వస్తుంది.

కొత్త ఐఫోన్‌తో ఛార్జర్‌ను కూడా అందించాలని బ్రెజిల్‌కు చెందిన సావో పాలో రాష్ట్ర ప్రభుత్వం ఆపిల్‌ను ఆదేశించింది. దీంతో ఆపిల్ ఇప్పుడు ఐఫోన్‌ను ఛార్జర్‌తో పాటు ఫ్రాన్స్‌, బ్రెజిల్‌లో కూడా విక్రయిస్తుంది. సావో పాలో వినియోగదారుల రక్షణ సంస్థ ప్రోకాన్-ఎస్‌పి ఈ విషయాన్ని ధృవీకరించింది. 

ఏదైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తిలో ఛార్జర్ ఒక ముఖ్యమైన భాగం అని, అది లేకుండా ఏ ఉత్పత్తిని అమ్మడం సముచితం కాదని ఏజెన్సీ తెలిపింది. ఆపిల్ సంస్థ చార్జర్,  ఇయర్‌ఫోన్‌లు ఇవ్వకపోవడం పై నిర్ణయనికిగల కారణాలను ఇంకా ఇవ్వలేదని ఏజెన్సీ తెలిపింది.