Asianet News TeluguAsianet News Telugu

షియోమి కొత్త ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌.. కేవలం 19 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ చార్జ్..

తాజాగా  షియోమి సంస్థ 80W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌ను ఆవిష్కరించింది. ఇది కేవలం 19 నిమిషాల్లో 4000 mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి ఒక చైనా వెబ్ సైట్ లో కంపెనీ షేర్ చేసింది.
 

Xiaomi Announces 80W Fast Wireless Charging That Can Completely Charge a 4,000mAh Battery in Just 19 Minutes-sak
Author
Hyderabad, First Published Oct 19, 2020, 4:36 PM IST

వైర్ ఛార్జింగ్‌లో ఫాస్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన తర్వాత చైనా సంస్థ షియోమి ఇప్పుడు వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. తాజాగా  షియోమి సంస్థ 80W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్‌ను ఆవిష్కరించింది. ఇది కేవలం 19 నిమిషాల్లో 4000 mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.

ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి ఒక చైనా వెబ్ సైట్ లో కంపెనీ షేర్ చేసింది. 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌ను కంపెనీ ప్రకటించనప్పటికీ, వైర్‌లెస్ ఛార్జింగ్ త్వరలో వైర్డ్ ఛార్జింగ్‌ను భర్తీ చేస్తుందని పేర్కొంది.  
 
షియోమి యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను షేర్ చేసింది, ఇందులో ఎం‌ఐ 10 ప్రో 80 వాట్ వైర్‌లెస్ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేయడాన్ని మీరు చూడవచ్చు. ప్రస్తుతం 80W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ పొందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాలేదు.

also read 5 వేలకే రిలయన్స్ జియో 5జి స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్ ఎప్పుడంటే ? ...

షియోమి షేర్ చేసిన వీడియోలో కేవలం ఎనిమిది నిమిషాల్లో ఫోన్ బ్యాటరీ 10-50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని, పూర్తి ఛార్జ్ కావడానికి 19 నిమిషాలు పడుతుందని తెలిపింది. 

షియోమి యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియో కొత్త టెక్నాలజి డివైజ్ ని చూపిస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ వేగాన్ని చూపించడానికి ఎం‌ఐ 10 ప్రోను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది.

కేవలం 1 నిమిషంలో 0 నుండి 10 శాతం, 8 నిమిషాల్లో 10 నుండి 50 శాతం, ఆపై 19 నిమిషాల్లో 100 శాతం  వైర్‌లెస్ ఛార్జర్ స్మార్ట్ ఫోన్ చార్జ్ చేస్తుంది. ఎం‌ఐ 10 ప్రో వైర్‌లెస్ ఛార్జింగ్‌ స్టాండ్‌లో అమర్చడాన్ని పోస్టర్‌లో కూడా చూడవచ్చు.

మార్చిలో 40W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని, ఆగస్టులో 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఎం‌ఐ 10 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ కూడా  సపోర్ట్ ఇస్తుంది. సెప్టెంబరులో 30W వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్‌ను షియోమి విడుదల చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios