సోషల్ మీడియా యాప్, ఇంస్టంట్ మెసేజింగ్ వాట్సాప్  ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంది.

తాజాగా వాట్సాప్  మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అదేంటంటే వాట్సాప్  గ్రూప్ కాల్స్ కోసం కొత్త రింగ్‌టోన్‌, యానిమేష‌న్ స్టిక్క‌ర్స్, కెమెరా ఐకాన్‌ను తిరిగి అందుబాటులోకి తేవ‌డం వంటి స‌దుపాయాల‌ను తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది వీటన్నంటినీ ప్ర‌స్తుతం కొత్త‌గా వ‌స్తున్న ఆండ్రాయిడ్ బీటా వ‌ర్ష‌న్‌ల‌లో ప‌రీక్షిస్తోంది.

also read రియల్‌మీ యూత్‌ డేస్‌ సేల్‌..స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ పై ఆఫర్లే ఆఫర్లు.. ...

WABetainfo ప్రకారం ఆండ్రాయిడ్ తాజా బీటా వెర్షన్లలో వాట్సాప్ ఈ కొత్త ఫీచర్లను పరీక్షిస్తోంది. 2.20.198.11 వెర్షన్ గ్రూప్ కాల్‌ల కోసం కొత్త రింగ్‌టోన్‌ను తెస్తుంది. వాట్సాప్ యానిమేషన్ స్టిక్కర్ల కోసం కొత్త యానిమేషన్ ఫీచర్ కూడా ప్రవేశపెట్టింది.

యానిమేషన్ 8 సార్లు ప్లే అవుతుంది. వాట్సాప్ ఇటీవలే యానిమేటెడ్ స్టిక్కర్లను విడుదల చేసింది. కొత్త అప్ డేట్ స్టిక్కర్ యూసర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కెమెరా షార్ట్‌క‌ట్ స‌దుపాయాన్ని తీసుకురానుంది.

ఈ కొత్త ఫీచ‌ర్‌లో డాక్యుమెంట్లు, కెమెరా, ఫొటోలు, లొకేష‌న్‌, కాంటాక్ట్ షార్ట్‌కట్స్‌ను సులువుగా గుర్తించ‌వచ్చు. అలాగే వాట్సాప్‌లోని ఫైళ్ల‌ను సుల‌భంగా వెతికేందుకు వీలుగా అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచ‌ర్‌ను కూడా విడుద‌ల చేసింది. అయితే ఇవ‌న్నీ ఇంకా పూర్తిగా అందుబాటులోకి  రాలేదు.