మీ ఫ్రెండ్స్ వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ ట్రిక్ మీకోసమే..

ఈ ఫీచర్లను, వాట్సప్ ట్రీక్కులను కొంతమందికి ఎలా ఉపయోగించాలో తెలియదు. చాలా వరకు వారి ఫోటోలను, వీడియోలను వాట్సప్  స్టేటస్ లో పెడుతు అప్ డేట్ చేస్తుంటారు. తరువాత మన స్టేటస్ ఎంతమంది చూశారో చెక్ చేస్తుంటాం. 

WhatsApp trick: How to hide your view on your friends WhatsApp Status

ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకోస్తు వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ ఫీచర్లను, వాట్సప్ ట్రీక్కులను కొంతమందికి ఎలా ఉపయోగించాలో తెలియదు. చాలా వరకు వారి ఫోటోలను, వీడియోలను వాట్సప్  స్టేటస్ లో పెడుతు అప్ డేట్ చేస్తుంటారు.

తరువాత మన స్టేటస్ ఎంతమంది చూశారో చెక్ చేస్తుంటాం. కొందరికి వాట్సాప్ స్టేటస్ చూడటం అంటే ఎంతో ఆసక్తి, మీ స్టేటస్ చుసిన వాళ్లు కాకుండా ఇతరులు కూడా మీ స్టేటస్ ని చూస్తుంటారు. అవును.. ఇది నిజమే ఎలా అనుకుంటున్నారా.. 

వాట్సాప్ లో మీ స్టేటస్ పోస్ట్‌లను కొందరికి మాత్రమే కనిపించేల హైడ్ చేయవచ్చు, అలాగే మీ స్నేహితుల వాట్సాప్ స్టేటస్ పోస్టులను వారికి తెలియకుండానే మీరు వాటిని ఎలా చూడవచ్చో ఇక్కడ ఉంది:

also read  ఇండియన్ గేమర్స్ కి గుడ్ న్యూస్.. గూగుల్ ప్లేస్టోరులో ఫావ్-జి గేమ్ రిజిస్ట్రేషన్ ఓపెన్.. ...

* వాట్సాప్ సెట్టింగులకు వెళ్ళండి
* తరువాత అక్కౌంట్ టాబ్‌పై  క్లిక్ చేయండి
* ప్రైవసీ ఆప్షన్ పై నొక్కి తరువాత రీడ్ రిసిప్ట్ ఆప్షన్ కోసం కిందకి స్క్రోల్ చేయండి
* మీరు  ఇతరుల చాట్‌లను, అలాగే వాట్సాప్ స్టేటస్ లను చూశాక మీరు చూసినట్లు వారికి తెలియకుండా ఉండటానికి దాన్ని ఆఫ్ చేయండి

ఈ ఆప్షన్ మీ స్టేటస్ పోస్ట్‌లలోని వ్యూస్ కూడా హైడ్ చేస్తుంది, కాబట్టి మీ వాట్సాప్ స్టేటస్ కూడా ఎవరు చూశారో తెలియదు.

వాట్సాప్ ఇప్పుడు  మరో కొత్త ఫీచర్  తీసుకురానుంది, అదేంటంటే ఆడియో మెసేజెస్ కోసం నోటిఫికేషన్ సౌండ్ ప్లే అవుతుంది. వాయిస్ మెసేజులను, ఆడియో ఫిలెస్ వినడానికి యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.

వాట్సాప్ బీటా ఐ‌ఓ‌ఎస్ వెర్షన్ 2.19.91.1 కోసం ఈ ఫీచర్ రూపొందించారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐ‌ఓ‌ఎస్ యూసర్ల కోసం పరీక్షించుతున్నప్పటికీ త్వరలో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios