Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించాలనుకుంటున్నారా.. అయితే రూల్స్ పాటించండి..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ పేమెంట్ సేవలను 2 కోట్ల వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఒక మిలియన్ మంది మాత్రమే ఈ వాట్సాప్ పేమెంట్ సేవను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ప్రస్తుతం భారతదేశంలో 400 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది.

 

whatsapp payment service features process and rules know all about it now
Author
Hyderabad, First Published Nov 7, 2020, 1:35 PM IST

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతదేశంలో పేమెంట్ సర్వీసులను ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ పేమెంట్ సేవలను 2 కోట్ల వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం ఒక మిలియన్ మంది మాత్రమే ఈ వాట్సాప్ పేమెంట్ సేవను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ప్రస్తుతం భారతదేశంలో 400 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది, కాని ప్రస్తుతం 1 కోటి మందికి మాత్రమే ఈ వాట్సాప్ పేమెంట్ సేవను ఉపయోగించడానికి అనుమతి ఉంది.

ఇప్పుడు దానిని 2 కోట్లకు పెంచడానికి కంపెనీకి అనుమతి లభించింది. వాట్సాప్ చెల్లింపు సేవలను ఎన్‌సిపిఐ సమీక్షిస్తుంది. ఇప్పటివరకు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జియో పేమెంట్స్ బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందం కుదుర్చుకుంది.

మీరు మీ మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ పేమెంట్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందాం.

- మీరు వాట్సాప్ పేమెంట్ ఉపయోగించలంటే  వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను తప్పనిసరి. దీని కోసం మీరు గూగుల్  ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌ ద్వారా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా అప్‌డేట్ చేసుకోవచ్చు.

also read దీపావళికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే 15వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే ...

 - ఇప్పుడు మీరు వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి కుడి వైపున ఉన్న మెనూలోని మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

- తరువాత పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆపై యాడ్ పేమెంట్ ప్రాసెస్ పై క్లిక్ చేయండి.

- ఇప్పుడు మీరు మీ బ్యాంకు ఎంచుకోవాలి. ప్రస్తుతం దీనికి 5 బ్యాంకుల ఆప్షన్ మాత్రమే ఉంది. ఇక్కడ మీరు మీ బ్యాంకు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

- తరువాత బ్యాంక్ అక్కౌంట్ నెంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మీరు వాట్సాప్ ద్వారా సులభంగా పేమెంట్స్ చెయ్యగలరు.

-వాట్సాప్ ద్వారా, మీరు మీ కాంటాక్ట్స్ లోని వారికి డబ్బు పంపవచ్చు, ఇందుకు మీరు డబ్బు పంపించేవారికి కూడా వాట్సాప్ పేమెంట్ సర్వీస్ ఉపయోగించే వారై ఉండాలి. మీరు వాట్సాప్ పేమెంట్ రిజిస్ట్రేషన్ చేయని వారికి డబ్బు పంపించాలనుకుంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఇందులో మీరు రిసీవర్‌కు వాట్సాప్ సర్వీస్ కోసం రిజిస్టర్ చేసుకోమని చెప్పే అవకాశం ఉంటుంది. 

-మొదట మీరు డబ్బు పంపించాలనుకున్న యూజర్ చాట్‌ ఓపెన్ చేయాలి.

- మీరు అటాచ్మెంట్  సింబల్ పై క్లిక్ చేసి, తరువాత పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

- ఇప్పుడు మీరు పంపాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసి ప్రోసిడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

- ఇప్పుడు మీరు మీ యుపిఐ పిన్ను ఎంటర్ చేయాలి. పేమెంట్ ప్రాసెస్ పూర్తి అవగానే మీకు బ్యాంక్ నోటిఫికేషన్ వస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios