వాట్సాప్  చాట్ సెట్టింగులలో కొత్త ఆప్షన్ వచ్చింది. అదేంటంటే ఏదైనా చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయడానికి వాట్సాప్ ఇప్పుడు మిమ్మల్ని అనుమతిస్తుంది.

వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది, ఇప్పుడు ఇది లేటెస్ట్ వెర్షన్‌లో అందుబాటులోకి వస్తోంది.

వాట్సాప్ చాట్ లో చాట్స్ మ్యూట్ చేయడానికి ఇప్పుడు 8 గంటలు, 1 వారం ఆప్షన్ తో పాటు మరో కొత్త ఆప్షన్ జోడించారు. పర్సనల్ చాట్‌లను లేదా గ్రూప్ చాట్‌లను ఎప్పటికీ మ్యూట్ చేయడానికి వినియోగదారుల కోసం "మ్యూట్ ఫారెవర్" ఆప్షన్ చేర్చారు.

వాట్సాప్ ట్విట్టర్ ఖాతా ద్వారా "యూజర్లు ఇప్పుడు వారి చాట్లను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని" తెలిపారు. చాట్ మ్యూట్ సెట్టింగ్‌లలో ఇప్పుడు ‘8 గంటలు’, ‘1 వారం’ ఆప్షన్ తో పాటు ‘మ్యూట్ ఫారెవర్ ’ ఆప్షన్ అందుబాటులోకి తేచ్చింది.

also read ఫేస్‌బుక్‌ కొత్త డేటింగ్ సర్వీస్.. 32 దేశాలలో అందుబాటులోకీ.. ...

‘మ్యూట్ ఫారెవర్ ’ ఆప్షన్ సెట్టింగులలో భాగమైన ‘మ్యూట్ 1 ఇయర్’ ఆప్షన్ ను భర్తీ చేస్తుంది. మ్యూట్ చేసిన వాట్సాప్ చాట్ నోటిఫికేషన్లను మీకు చూపించాలనుకుంటున్నారా లేదా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్. ఈ క్రొత్త ఫీచర్ ఐ‌ఓ‌ఎస్ లేదా ఆండ్రోయిడ్ డివైజెస్, అలాగే వాట్సాప్ వెబ్‌లో అందుబాటులో ఉంది.

వాట్సాప్ లో చాట్ "మ్యూట్ ఫారెవర్" ఎలా చేయవచ్చాంటే ? 

మీరు చాట్‌ను మ్యూట్ చేయలనుకున్న  చాట్‌ను ఓపెన్ చేయండి, పైన కుడి వైపున ఉన్న మెను ఆప్షన్ పై నొక్కండి, తరువాత మ్యూట్ నోటిఫికేషన్‌ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీరు అక్కడ మూడు ఆప్షన్లను చూస్తారు, అందులో ఉన్న చివరిది ‘మ్యూట్ ఫారెవర్’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని  ఒకే నొక్కండి.

మీరు వార్నింగ్ లేకుండా నోటిఫికేషన్‌లను చూడాలనుకుంటే షో నోటిఫికేషన్‌ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మ్యూట్ చేసిన తర్వాత, మ్యూట్ నోటిఫికేషన్ ఆప్షన్ కు బదులుగా చాట్ సెట్టింగులలో అన్మ్యూట్ నోటిఫికేషన్స్ ఆప్షన్ మీరు చూడవచ్చు.

ఈ నెల ప్రారంభంలో వాట్సాప్ కొత్తగా ‘ఆల్వేస్ మ్యూట్' ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.201.10తో పాటు మరికొన్ని ఫీచర్లతో వస్తోంది.