వాట్సాప్‌లో స్నాప్‌చాట్ లాంటి మరో కొత్త ఫీచర్.. వాటిని ఈజిగా డిలీట్ చేయవచ్చు..
ఈ ఫీచర్ మొదట స్నాప్‌చాట్‌లో ఉండేది, ఇప్పుడు వాట్సాప్ బీటా వెర్షన్‌లో పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌లలో ఈ ఫీచర్‌ను తీసుకురవొచ్చు. వాట్సాప్ గ్రూపులు, పర్సనల్ చాట్ ల నుంచి వచ్చి మెసేజ్‌లను, ఫోటోలను, వీడియోల కంటెంట్‌ను డిలీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ఫీచర్ ప్రేవేశపెట్టబోతుంది. ఈ ఫీచర్ మొదట స్నాప్‌చాట్‌లో ఉండేది, ఇప్పుడు వాట్సాప్ బీటా వెర్షన్‌లో పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌లలో ఈ ఫీచర్‌ను తీసుకురవొచ్చు.
వాట్సాప్ గ్రూపులు, పర్సనల్ చాట్ ల నుంచి వచ్చి మెసేజ్‌లను, ఫోటోలను, వీడియోల కంటెంట్‌ను డిలీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ఇలాంటి మోసేజెస్‌లను సులువుగా డిలెట్ చేసేందుకు ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
ఈ ఫీచర్స్ టెలిగ్రామ్, స్నాప్‌చాట్‌లకు భిన్నంగా ఉన్నప్పటికీ, ఇది అదే విధంగా పనిచేస్తుంది. మరోవైపు స్నాప్‌చాట్‌లో చాట్‌లు ఓపెన్ చేసిన తరువాత 24 గంటల్లోనే మెసేజెస్ తొలగించబడతాయి. అలాగే ఓపెన్ చేయని చాట్‌లు 30 రోజుల తర్వాత అదృశ్యమవుతాయి.
దీని ద్వారా వాట్సాప్ యూజర్లు తమ ఫోన్‌లలో స్టోరేజ్ డాటాను పెంచుకోవచ్చని వాట్సాప్ వెల్లడించింది.ఈ ఫీచర్ కావాలంటే ఎనేబుల్ వొద్దనుకుంటే డిసేబుల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది, ఇది వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది, కానీ వాట్సాప్ గ్రూపులలో ఈ ఫీచర్ అడ్మిన్ మాత్రమే ఉంటుంది.
also read అమెజాన్ లో సిల్క్ మార్క్ చీరలు.. డ్రెస్ మెటీరియల్స్, షర్టులతో సహ 3వేల ప్రొడక్టులు అందుబాటులోకి.. ...
వినియోగదారులకు ఉపయోగపడే విదంగా స్టోరేజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనిద్వారా ఫార్వార్డ్ చేసిన, అనవసరమైన వీడియోలను, ఫొటోలను మరింత సులభం డిలీట్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఏంటంటే 5ఎంబీ కంటే ఎక్కువ సైజులో ఉన్న మీడియా డాటాను గుర్తిస్తుంది.
ఫైల్ సైజ్‌ను బట్టి విడివిడిగా చూపిస్తుందని, దాని ద్వారా అవసరమైన వాటిని, అనవసరమైన వాటిని వినియోగదారులు త్వరగా గుర్తించగలుగుతారని సంస్థ చెప్పింది. అంతేకాకుండా ఒకటి లేదా చాలా వాటిని డిలీట్ చేయడానికి ముందు ఒకసారి చూసుకునే వెసులుబాటును కల్పిస్తుందని అన్నారు.
అయితే ఈ ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల చివరి నాటికి, ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్‌తో సహా ఐఓఎస్ ఆండ్రాయిడ్, లైనక్స్ ఆధారిత కైయోస్ డివైజెస్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజి అండ్ డేటాలో ఈ ఫీచర్ కనిపిస్తుందని సంస్థ తెలిపింది.
ఇప్పటి వరకూ వాట్సాప్ ‘స్టోరేజ్ యూసేజ్’ విభాగం కింద చాట్‌లు కనిపించేవి. తాజా ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇంటర్‌ఫేస్ బార్‌మీద కనిపిస్తుంది. ఇందులో మీడియా కంటెంట్ ద్వారా ఎంత స్టోరేజ్ వినియోగించాం అనేది కూడా చూపిస్తుంది. అలాగే ఎక్కువగా ఫార్వార్డ్ చేసిన మీడియా ఫైళ్ళను ప్రత్యేకంగా చూపిస్తుంది.