టిక్‌టాక్, షేర్ ఇట్, యుసి బ్రౌజర్ సహ ఇతర చైనీస్ యాప్స్ నిషేదించిన తరువాత అవి మీ ఫోన్లో కనిపించవు, ఎందుకంటే ఇకపై ఆ యాప్స్ భారతదేశంలో డేటాను యాక్సెస్ చేయలేవు. టిక్‌టాక్, యుసి బ్రౌజర్, కామ్‌స్కానర్, షేర్ ఇట్, హెలో ఇంకా ఇతర ప్రముఖమైన యాప్స్ తో సహా మొత్తం  59 చైనీస్ యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం జారీ చేసింది.

గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐ‌ఓ‌ఎస్ యాప్ స్టోర్‌లో కూడా వీటిని బ్యాన్ చేశాయి. అయితే, ఇప్పటికే టిక్​టాక్​ను ఇన్​స్టాల్​ చేసుకున్న వారి పరిస్థితేంటి? ఆ యాప్​ పని చేస్తుందా? లేదా దాన్ని వెంటనే అన్​ఇన్​స్టాల్ చేసేయాలా? ప్రభుత్వం నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందా? ఇలాంటి సందేహాలు మీకు రవొచ్చు

అయితే ఈ యాప్స్ పనిచేయలంటే ముఖ్యమైనడి ఏంటంటే డేటా అని గమనించాలీ.ఈ విషయాలపై పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వ వర్గాలు ఒక న్యూస్ చానల్ కి ధృవీకరించాయి. అధికారులు ఇప్పటికే అన్ని భారతీయ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐ‌ఎస్‌పి), టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టి‌ఎస్‌పి) లకు సమాచారం ఇచ్చాయని, వారు ఈ యాప్స్ కి అన్ని డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ ను  ఆపివేశారన్నారు.

బ్యాన్ చేసిన వాటిలో ఎక్కువ యప్స్ ఆన్‌లైన్‌లో మాత్రమే పనిచేస్తాయి కాబట్టి (ఉదాహరణకు, టిక్‌టాక్, యుసి బ్రౌజర్, క్లాష్ ఆఫ్ కింగ్స్ ఒక ఆన్‌లైన్ గేమ్) వీటిని ఇంటర్నెట్ అక్సెస్ నిలిపేయడంతో అవి ఇక పనిచేయవు. టిక్‌టాక్, యుసి బ్రౌజర్, షేరిట్, విచాట్ పై ఎక్కువగా ప్రభావం పడనుంది.

also read కిరాణా సరుకుల కోసం అమెజాన్ కొత్త సేవలు.. ఎలా ఆర్డర్ చేయాలంటే..? ...

ఈ యాప్స్ ఇక పై భారతదేశంలో డెవలపర్ సపోర్ట్  పొందలేవు. ఫలితంగా, ఈ యాప్ లను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసిన వినియోగదారులు యాక్సెస్ చేయలేరు. ఇండియాలో ఉన్న అన్నీ యాప్స్ స్టోర్స్ టిక్​టాక్​తో సహా నిషేధానికి గురైన ఏ యాప్​కూ అప్​డేట్స్ చూపించవు.

అయినా ఫోన్లలో ఆ యాప్స్​ను ఉంచుకుంటే భద్రత తగ్గి హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువ. గతంలో ఓ యాప్ నిషేధానికి గురైతే డేటాతో సంబంధం లేకుండా పని చేసేది. కానీ ఇండియన్ నెట్​వర్క్స్​ కూడా ఈ 59 యాప్స్​కి డేటా సరఫరా చేయొద్దని ఆదేశాలు అందడంతో భారత్​లో ఇవి పని చేయడం అసాధ్యం.

బ్యాన్ చేసిన యాప్స్ ఇకపై భారతీయ నెట్‌వర్క్‌లలో డేటాను యాక్సెస్ చేయలేవు కాబట్టి, అవి పనికిరానివిగా ఉంటాయి. చైనా సైబర్ నేరాల గురించి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనల మధ్య, గాల్వన్ వ్యాలీ సరిహద్దులో ఇండో-చైనా ఘర్షణ వెలుగులోకి వచ్చాకా 59 చైనా యాప్స్ పై నిషేధం వచ్చింది.

భారతదేశంలో గణనీయమైన పాపులరిటీ కలిగి ఉన్న బైటెడాన్స్, షియోమి వంటివి ఈ నిషేధాల ఫలితంగా తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, ఎందుకంటే భారతదేశంలో వారి వ్యాపారాలు మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.