మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ గురువారం ట్వీట్లకు 'ఎడిట్' బటన్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో ఒక మెలిక కూడా ఉంది అదేంటంటే కరోనా వైరస్ మహమ్మారి మధ్య అందరూ ఫేస్ మాస్క్ ధరించడం ప్రారంభించినప్పుడు మాత్రమే ప్రవేశపెడతమని తెలిపింది.

ట్విట్టర్‌లో దాదాపు 320 మిలియన్లకు పైగా ఆక్టివ్ యూసర్లు ఉన్నారని అంచనా వేసింది. ట్వీట్ పబ్లిష్ చేసిన తర్వాత వాటిని ఎడిట్ చేసేందుకు వీలు కల్పించే ఎడిట్ ఆప్షన్ ప్రేవేశపెట్టాలి చాలా మంది అడుగుతున్నారు. ట్విట్టర్ యుసర్ల నుండి పదేపదే అభ్యర్థనలు వాస్తున్నప్పటికీ ట్విట్టర్ దీనిని చాలాకాలంగా నిరాకరించింది.

అయితే గురువారం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం బహిరంగంగా ఫేస్ మాస్క్‌లు ధరించడం గురించి చర్చలో భాగంగా ఈ విషయాన్ని చెప్పింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం ప్రారంభించిన తర్వాత మాత్రమే ట్వీట్లకు 'ఎడిట్' ఆప్షన్ తీసుకోస్తామని  చెప్పారు.

also read జూమ్​, గూగుల్ యాప్స్ పోటీగా రిలయన్స్ జియో కొత్త యాప్.. ...

"అందరూ ఫేస్ మాస్క్ ధరించినప్పుడు మీరు ఎడిట్ బటన్‌ను చూడవచ్చు" అని ట్విట్టర్ ట్వీట్ చేసింది. మరో  ప్రత్యేక ట్వీట్‌లో "అందరూ అంటే ప్రతి ఒక్కరూ" అని గుర్తుంచుకోవాలి అని తెలిపింది. చాలా మంది ట్విట్టర్ యూసర్లు ఈ ప్రకటనపై వినోదభరితంగా స్పందించారు, చాలా మంది ట్వీట్లతో కామెంట్లు కూడా చేశారు.

అయితే అమెరికాలో రగులుతున్న 'ఫేస్ మాస్క్ వర్సెస్ నో ఫేస్ మాస్క్' చర్చపై ఒక వైఖరి తీసుకోవడం కోసం ట్విట్టర్ "రాజకీయం" ను చేస్తోందని చాలా మంది ఆరోపించారు. ఫేస్ మస్కూలు ధరించడం దేశంలో వివాదాస్పద సమస్యగా మారింది,

ఇక్కడ ప్రజలు అంటువ్యాధి అయిన కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రజలు అనేక నిరసనలు చేశారు. వైరస్ విస్తృతంగా ఉన్న ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం కష్టమని జూన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో వైరడ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే మాట్లాడుతూ తప్పుడు సమాచారం వ్యాప్తికి సహాయపడే ఎడిట్ ఫీచర్‌ను కంపెనీ ఎప్పటికీ జోడించదని చెప్పారు.