Asianet News TeluguAsianet News Telugu

మేము శత్రువులం కాదు: ఫేస్‌బుక్‌కు టిక్‌టాక్ సీఈఓ కౌంటర్..

ఇండియాలో టిక్‌టాక్‌ను నిషేధించిన తరువాత అమెరికా కూడా టిక్‌టాక్‌ను నిషేధించాలని చూస్తోంది. టిక్‌టాక్‌పై నిషేధం రావడంతో ఇండియాలో స్వదేశీ యాప్స్ డౌన్ లోడ్స్ భారీగా పెరిగాయి.

We are not the enemy: TikTok CEO counters facebook
Author
Hyderabad, First Published Jul 31, 2020, 11:27 AM IST

బెంగుళూరు: భారతదేశ ప్రభుత్వం గత కొద్దిరోజుల కిందట 59 చైనా యాప్స్ నిషేధించింది. భారత్‌, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా యాప్‌ టిక్‌టాక్‌ను కూడా నిషేందించింది.

ఇండియాలో టిక్‌టాక్‌ను నిషేధించిన తరువాత అమెరికా కూడా టిక్‌టాక్‌ను నిషేధించాలని చూస్తోంది. టిక్‌టాక్‌పై నిషేధం రావడంతో ఇండియాలో స్వదేశీ యాప్స్ డౌన్ లోడ్స్ భారీగా పెరిగాయి.

ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కొత్త రీల్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఫేస్‌బుక్‌ సంస్థకు టిక్‌టాక్‌ యాప్ గట్టిగా కౌంటరిచ్చింది.

also read సింగిల్‌ టేక్‌ ఫీచర్‌ తో శాంసంగ్ గెలాక్సీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..! ...

యూసర్లకు మెరుగైన సేవలందిస్తూ ఇప్పటికే యూ.ఎస్‌లో టిక్‌టాక్‌ పాపులర్ అవడంతో పాటు భారీగా ప్రజాదరణ పొందిందని తెలిపింది.

ఏ దేశంలోనైనా టిక్‌టాక్‌ తన సేవలను మెరుగుపరుచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుందని, ఫేస్‌బుక్‌ లాగా పోటీదారులను దెబ్బకొట్టడానికి దేశభక్తి లాంటి పదాలను వాడదని టిక్‌టాక్‌ సీఈఓ కెవిన్‌ మేయర్‌ అన్నారు.

టిక్‌టాక్‌ యాప్ చైనా యాప్ అంటూ వస్తున్న సోషల్ మీడియాలోని వార్తలు అవాస్తవం అని టిక్‌టాక్‌ గతంలో వివరణ ఇచ్చింది.

ఇప్పటికే ఫేస్‌బుక్‌కు చెందిన వీడియో యాప్‌ లాసో విఫలం చెందిన విషయాన్ని టిక్‌టాక్‌ ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ విషయాన్ని ఆలస్యంగా ప్రపంచానికి చెప్పారని చైనాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios