Asianet News TeluguAsianet News Telugu

పన్ను వివాదంలో వోడాఫోన్ విజయం.. నష్టపరిహారంగా 40 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం..

హేడాలోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ వోడాఫోన్‌పై భారత ప్రభుత్వం పన్ను విధించడం భారతదేశం, నెదర్లాండ్స్‌ల మధ్య పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని తెలిపింది. ట్రిబ్యునల్ తన తీర్పులో ప్రభుత్వం వోడాఫోన్ నుండి బకాయిలు కోరడం మానేయాలని, నష్టపరిహారంగా కంపెనీకి రూ. 40 కోట్లకు పైగా చెల్లించాలని పేర్కొంది.

vodafone wons international arbitration case against government in 20 thousand crore tax  dispute case
Author
Hyderabad, First Published Sep 26, 2020, 1:30 PM IST

న్యూ ఢీల్లీ:  టెలికాం దిగ్గజం వొడాఫోన్ అంతర్జాతీయ కోర్టులో భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.20,000 కోట్ల పన్ను  వివాదంలో విజయం సాధించామని తెలిపింది. హేడాలోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ వోడాఫోన్‌పై భారత ప్రభుత్వం పన్ను విధించడం భారతదేశం, నెదర్లాండ్స్‌ల మధ్య పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని తెలిపింది.

ట్రిబ్యునల్ తన తీర్పులో ప్రభుత్వం వోడాఫోన్ నుండి బకాయిలు కోరడం మానేయాలని, నష్టపరిహారంగా కంపెనీకి రూ. 40 కోట్లకు పైగా చెల్లించాలని పేర్కొంది. "వోడాఫోన్‌కు చివరకు న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు కొట్టేసిన పన్నును తిరిగి పొందటానికి ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వం పునరాలోచన సవరణతో వచ్చింది.

ఈ చర్య పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ట్రిబ్యునల్  పేర్కొంది" అని అనురాధా దత్ , వొడాఫోన్ కోసం వాదించిన న్యూ ఢీల్లీకి చెందిన డిఎమ్‌డి అడ్వకేట్స్ మేనేజింగ్ భాగస్వామి చెప్పారు. "అలాగే, భారత ప్రభుత్వం వసూలు చేసిన పన్నును తిరిగి చెల్లించవలసి ఉంటుంది, ఇది సుమారు రూ.45 కోట్లు.

also read  వాట్సాప్ మెసేజెస్ ఇతరులు యాక్సెస్ చేయలేరు.. పాస్‌వర్డ్‌లు లేదా బయోమెట్రిక్ ఐడీ పాటించండి.. ..

ఈ మొత్తాన్ని భారత అధికారులు, దాని న్యాయ సలహాదారులు అధ్యయనం చేస్తున్నారని తెలిసింది, వారు తగిన ఫోరమ్లలో తగిన న్యాయ పరిష్కారాలను చేస్తారు "అని వర్గాలు తెలిపాయి. 12,000 కోట్ల వడ్డీ, 7,900 కోట్ల జరిమానాతో కూడిన పన్ను వివాదం 2007లో హడిసన్ వాంపోవా నుండి వొడాఫోన్ భారతీయ మొబైల్ ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా ఈ వివాదం వచ్చింది.

వోడాఫోన్ కొనుగోలుపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం తెలిపింది. 2012 లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం టెలికాం ప్రొవైడర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది, కాని ఆ సంవత్సరం తరువాత ప్రభుత్వం అప్పటికే ముగిసిన పన్ను ఒప్పందాలకు వీలుగా నియమాలను మార్చి వొడాఫోన్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది.

దీనితో ఏప్రిల్ 2014లో వోడాఫోన్ భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రాన్ని ఆశ్రయించింది. భారీగా రుణపడి ఉన్న టెలికాం సంస్థ ఈ నెల ప్రారంభంలో కొంత ఉపశమనం పొందింది, ఎందుకంటే సుప్రీంకోర్టు మొబైల్ క్యారియర్‌లకు ప్రభుత్వ బకాయిలను పరిష్కరించడానికి 10 సంవత్సరాల సమయం ఇచ్చింది.

భారతదేశ టెలికాం ప్రొవైడర్లు టెలికాం శాఖకు వారి అడ్జస్ట్ చేసిన ఎజిఆర్ లో 3-5 శాతం ఎయిర్ వేవ్స్ వాడకం ఛార్జీలు, 8 శాతం ఎజిఆర్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి.

Follow Us:
Download App:
  • android
  • ios