Asianet News TeluguAsianet News Telugu

స్మార్ట్‌ఫోన్‌ యూసర్ల కోసం వొడాఫోన్ కొత్త ఈసిమ్‌..

 ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ ఎస్‌ఇ, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మాక్స్ , ఐఫోన్ ఎక్స్‌ఆర్ వంటి ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లను వాడే వొడాఫోన్ యూసర్లు ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. 

vodafone launches new esim for smartphones in india
Author
Hyderabad, First Published Jul 27, 2020, 3:38 PM IST

పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ఇసిమ్ సౌకర్యాన్ని వోడాఫోన్ ప్రకటించింది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ ఎస్‌ఇ, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మాక్స్ , ఐఫోన్ ఎక్స్‌ఆర్ వంటి ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లను వాడే వొడాఫోన్ యూసర్లు ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

త్వరలో ఈ సదుపాయాన్ని శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్‌కు అందుబాటులోకి తెస్తామని వోడాఫోన్ తెలిపింది. ముంబై, ఢీల్లీ, గుజరాత్‌లోని పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు వారి స్మార్ట్‌ఫోన్‌ కోసం ఇసిమ్‌ను పొందవచ్చు, త్వరలో మరిన్ని నగరాలులో ఇసిమ్‌ అందుబాటులోకి రానుంది.

  
ఇ-సిమ్‌ అంటే ఏమిటి?

 ఇసిమ్‌ అనేది మీ స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే ఇంటిగ్రేటెడ్ సిమ్ చిప్. సపోర్ట్ చేసే అన్ని మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లకు అనుగుణంగా ఉంటే ఇంటిగ్రేటెడ్ చిప్ ఇది. ఒక వినియోగదారుడు ఇసిమ్‌ని ఉపయోగించాలని ఎంచుకుంటే, వారు ఇకపై  స్మార్ట్ ఫోన్ లో నెట్‌వర్క్ పొందడానికి సాదారణ సిమ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. సిమ్ కార్డులను మాన్యువల్‌గా మార్చకుండా యూసర్లు సాధారణ కాల్‌లు, మెసేజెస్ పంపడం, ఇంటర్నెట్‌ను ఉపయోగించడం వంటివి చేయవచ్చు .

మీ ఫోన్‌లో ఇ-సిమ్‌ ఎలా పొందాలీ?

మీరు ఇప్పటికే వోడాఫోన్ కస్టమర్ అయితే మీరు 199 నంబర్ కు ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. ఈ‌ఎస్‌ఐ‌ఎం <స్పేస్> ఇమెయిల్ ఐ‌డిలో టైప్ చేయండి. మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అయిన ఇమెయిల్ ఐడి లేకపోతే మీరు ఇమెయిల్ <స్పేస్>> ఇమెయిల్ ఐడిని 199 కి పంపండి. మీ ఇమెయిల్ ఐడి నమోదు అయిన తర్వాత మీరు మొదటి ఎస్ఎంఎస్ పంపించి ప్రసస్ ప్రారంభించవచ్చు.

also read చైనాకు భారత్ మరో షాక్.. పబ్‌జితో సహ మరో 47 యాప్స్ పై నిషేధం ...

మీ ఇమెయిల్ వాలిడ్ అయితే, మీరు 199 నుండి SMS అందుకుంటారు. మీరు ఇ-సిమ్‌ అభ్యర్థనను నిర్ధారించడానికి ఈ‌ఎస్‌ఐ‌ఎం‌వై  అని కన్ఫర్మ్ ఇవ్వాలి.

మీ కన్ఫర్మేషన్  ఎస్‌ఎం‌ఎస్ ను పోస్ట్ చేయండి, 199 నుండి మరొక ఎస్‌ఎం‌ఎస్ ను వస్తుంది .

క్యూ‌ఆర్ కోడ్‌తో కూడిన ఇమెయిల్ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి పంపబడుతుంది. ఇప్పుడు మీరు క్యూ‌ఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.


 ఫోన్ వైఫై లేదా మొబైల్ డేటాకు కనెక్ట్  చేసుకున్న తరువాత,

- "సెట్టింగులు" కి వెళ్ళండి

- "మొబైల్ డేటా" పై అప్స్న్హన్ సెలెక్ట్ చేయండి.

- "డేటా ప్లాన్‌" పై క్లిక్ చేయండి

- ఇప్పుడు మీరు మెయిల్‌లో అందుకున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఫోన్‌లోని చూపించిన విధంగా అనుసరించండి.

కొత్త కస్టమర్లు క్రొత్త వోడాఫోన్ ఇసిమ్ కనెక్షన్ పొందడానికి గుర్తింపు కార్డ్, ఫోటోలతో మీ సమీప వొడాఫోన్ స్టోర్ సందర్శించాలి. మీ హ్యాండ్‌సెట్‌ను అలాగే తీసుకెళ్లండి, ఎందుకంటే ఆక్టివేషన్ ప్రాసెస్‌లో  క్యూఆర్ కోడ్‌ను వెంటనే స్కాన్ చేయవచ్చు

ఇమెయిల్ ద్వారా పంపిన క్యూఆర్ కోడ్ ఒకే స్కాన్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. కోడ్‌ను స్కాన్ చేసిన 2 గంటల్లో  ఇ-సిమ్ ఆక్టివేట్ అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios