వొడాఫోన్ ఐడియా రిబ్రాండ్ విఐ(వి)  కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వేర్వేరు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెడుతుంది. మీరు వోడాఫోన్ ఐడియా యూజర్ అయితే ప్రతిరోజూ 4 జిబి డేటాను అందించే వి ప్లాన్‌ల గురించి తెలుసుకోండి..

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్: వి రూ.299 ప్లాన్
రూ.299 విఐ ప్లాన్‌ డబుల్ డేటాను అందిస్తుంది, ప్రతిరోజూ 4జి‌బి (2జి‌బి ప్లస్ 2జి‌బి) డేటా ఇస్తుంది. ఇతర  నెట్‌వర్క్‌ లకు ప్రతిరోజూ ఆన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎం‌ఎస్ లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్   వాలిడిటీ 28 రోజులు, అంటే ఈ ప్లాన్ మొత్తం 112జి‌బి డేటాను అందిస్తుంది.

also read ఆక్వామారిన్ గ్రీన్ కలర్ వేరియంటులో ఆకట్టుకుంటున్న వివో వి20ఎస్ఇ కొత్త స్మార్ట్ ఫోన్.. ...

వోడాఫోన్ ఐడియా 449 ప్లాన్ 
రూ.449 ప్లాన్‌తో డబుల్ డేటా ఆఫర్ చేస్తున్నారు. వినియోగదారులు ప్రతిరోజూ 4జి‌బి (2జి‌బి + 2జి‌బి) హై-స్పీడ్ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు పొందుతారు. ఈ ప్లాన్‌ 56 రోజుల వాలిడిటీ ఉంటుంది, అంటే ఈ ప్లాన్ మొత్తం 224జి‌బి డేటాను అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా రూ.699 ప్లాన్
రూ.699 వోడాఫోన్ ఐడియా ప్లాన్‌ ట్రూలీ అన్‌లిమిటెడ్ కాలింగ్, 4 జిబి (2 జిబి డేటాతో డబుల్ డేటా ఆఫర్ కింద 2 జిబి అదనపు డేటా) డేటా అందిస్తుంది. డేటా, కాలింగ్ తో పాటు రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్‌ లు పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు, అంటే వినియోగదారులు ఈ ప్లాన్‌లో మొత్తం 336జి‌బి డేటాను పొందుతారు.

వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు వి మూవీస్, టివికి ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది. ప్రతిరోజూ జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయడానికి 75 రూపాయల ఫ్లాట్ తగ్గింపు అందిస్తుంది.