వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు దీపావళి ఆఫర్.. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..

రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కి పోటీగా వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది.  ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టడంతో వోడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల సంఖ్య 4కి పెంచింది.

 

vodafone idea or vi rs.699 postpaid plan offers unlimited data and amazon prime subscription free

వొడాఫోన్ ఐడియా రిబ్రాండ్ విఐ దీపావళి పండుగ నేపథ్యంలో తన కస్టమర్ల కోసం ఉచిత ఓ‌టి‌టి సబ్ స్క్రిప్షన్ తో కొత్త బడ్జెట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. అమెజాన్-నెట్‌ఫ్లిక్స్ వంటి ఓ‌టి‌టి ప్లాట్‌ఫామ్‌ల  ఫ్రీ సబ్ స్క్రిప్షన్ తో రిలయన్స్ జియో కూడా కొద్దిరోజుల క్రితం పోస్ట్‌పెయిడ్ ప్లాన్   ప్రారంభించింది.

రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కి పోటీగా వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది.  ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టడంతో వోడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల సంఖ్య 4కి పెంచింది, వీటిలో రూ.399, రూ.499, రూ.699, రూ.1,099 ప్లాన్స్  ఉన్నాయి. 

కొత్త ప్లాన్  వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
వొడాఫోన్ ఐడియా రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను డైలీ డేటా లిమిట్ లేకుండా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 150 జీబీ డేటా వస్తుంది, కాని  డైలీ డేటా లిమిట్ ఉండదు. అంతే కాకుండా, ఈ ప్లాన్ లో  ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు నెలరోజుల వాలిడిటీతో పొందవచ్చు. 

also read హ్యాపీ దీపావళి వాట్సాప్ స్టిక్కర్లను మీ సొంతంగా క్రియేట్ చేయవచ్చు.. ఎలా అంటే ? ...

ఈ ప్లాన్ ద్వారా  మీకు 99 రూపాయల విలువైన అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్, ఏ నేట్వర్క్ అయిన అల్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, 125 రూపాయల ఎంపిఎల్ క్యాష్, జోమాటో ఆర్డర్స్ పై 200 రూపాయల డిస్కౌంట్, వోడాఫోన్ ప్లే యాప్  సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

రిలయన్స్ జియో రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
మీరు వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌తో  రిలయన్స్ జియో రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో పోల్చినట్లయితే, ఈ జియో ప్లాన్ లో మొత్తం 150 జిబి డేటాను ఇస్తుంది. ఇది కాకుండా 200 జీబీ వరకు డేటా రోల్‌ఓవర్‌ను అందిస్తుంది.

జియో ఈ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందువచ్చు. ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios