వోడాఫోన్ ఐడియా ‘వీఐ’ కొత్త ప్లాన్లు.. ఇక ఆన్ లిమిటెడ్ కాలర్‌ట్యూన్‌లను సెట్ చేసుకోవచ్చు..

వి‌ఐ  కాలర్ ట్యూన్‌ యాప్ ఆపిల్, అండ్రయిడ్ వినియోగదారులకు ఆపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది. వోడాఫోన్ ఐడియా ప్రకారం, వి‌ఐ  కాలర్ ట్యూన్‌ యాప్ ద్వారా వినియోగదారులు ఉచిత టోన్‌లను  కాలర్ ట్యూన్‌ గా సెట్ చేసుకోవచ్చు అని తెలిపింది.

Vodafone Idea has launched an app dedicated for Vi Callertunes

టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియా ఈ వారం ప్రారంభంలో వి‌ఐగా రీబ్రాండింగ్ పూర్తి చేసుకున్నాకా కస్టమర్లను ఆకర్శించేందుకు కంపెనీ ప్రత్యేకంగా కాలర్ ట్యూన్‌లను సెట్ చేసుకోవడానికి  వి‌ఐ కాలర్ ట్యూన్‌ అనే యాప్ ప్రారంభించింది.

వి‌ఐ  కాలర్ ట్యూన్‌ యాప్ ఆపిల్, అండ్రయిడ్ వినియోగదారులకు ఆపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది. వోడాఫోన్ ఐడియా ప్రకారం, వి‌ఐ  కాలర్ ట్యూన్‌ యాప్ ద్వారా వినియోగదారులు ఉచిత టోన్‌లను  కాలర్ ట్యూన్‌ గా సెట్ చేసుకోవచ్చు అని తెలిపింది.

అలాగే వినియోగదారులు ప్రొఫైల్ ట్యూన్స్  వారి పేరుతో పాటు  సెట్ చేసుకోవచ్చు.  ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం వి‌ఐ యాప్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. వి‌ఐ కాలర్ ట్యూన్‌ 49 రూపాయల నుండి ప్రారంభమవుతాయి.

వి‌ఐ కాలర్ ట్యూన్‌  ప్లాన్స్ :

 రూ.49 ప్లాన్: రూ.49 కాలర్ ట్యూన్ ప్లాన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు నాలుగు వారాల పాటు, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు 30 రోజులు పాటు  50 కాలర్ ట్యూన్లను ఉచితంగా అందిస్తుంది.    

also read అతిపెద్ద 7000mAh బ్యాటరీతో మొట్టమొదటి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. తక్కువ ధరకే.. ...

రూ .69 ప్లాన్: ప్రీపెయిడ్ వినియోగదారులకు నాలుగు వారాలు, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు 30 రోజుల పాటు  ఆన్ లిమిటెడ్ కాలర్ ట్యూన్లను సెట్ చేసుకోవచ్చు.

రూ.99 ప్లాన్: ఈ ప్లాన్ 100 కాలర్ ట్యూన్లను మూడు నెలలు ఉచితంగా అందిస్తుంది.

రూ.249 ప్లాన్: ఈ ప్లాన్ ఒక సంవత్సరానికి అదనపు ఖర్చు లేకుండా 250 కాలర్ ట్యూన్లను సెట్ చేసుకోవచ్చు. 

రీబ్రాండింగ్ చేసిన కొద్దిరోజులకే వోడాఫోన్ ఐడియా ఒక ప్రకటనలో ఇతర టెలికాం కంపెనీలతో పోటీగా ఉండటానికి సుంకాలు పెరిగే అవకాశం ఉందని సూచించింది. అయితే కంపెనీ ఇప్పటి వరకు ప్లాన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios