టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా సమాచారం ప్రకారం వోడాఫోన్ ఐడియా నవంబర్ నెలలో అత్యధిక కాల్ క్వాలిటీ యూజర్ రేటింగ్‌ను పొందింది. వోడాఫోన్‌ సర్వీసు ప్రొవైడర్లలో వాయిస్ క్వాలిటీ విషయానికి వస్తే ఐడియా అగ్రస్థానంలో నిలిచినట్లు డేటా చూపిస్తుంది.

ఇటీవల వీఐగా రీబ్రాండ్ గా మారిన వోడాఫోన్ ఐడియా ఎయిర్‌టెల్, బి‌ఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్ జియోలను అధిగమించి ముందంజలో ఉంది. అయితే ట్రాయ్ వెబ్‌సైట్‌లోని వినియోగదారుల డేటాలో 2జి, 3జి, 4జితో సహా అన్ని నెట్‌వర్క్ యూసర్లు ఉన్నారు.

ట్రాయ్ మైకాల్ డాష్‌బోర్డ్‌లో తాజా డేటా ప్రకారం వోడాఫోన్ ఐడియా బిఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్ జియోలను నవంబర్ నెలలో కాల్ నాణ్యత పరంగా అధిగమించాయని చూపిస్తుంది. 4.9/5 రేటింగ్‌తో ఐడియా అగ్రస్థానంలో, 4.6/5 రేటింగ్‌తో వొడాఫోన్ ఉంది.

బిఎస్‌ఎన్‌ఎల్ 4.1/5 రేటింగ్‌తో, ఎయిర్‌టెల్ ఇంకా రిలయన్స్ జియో రెండూ 3.8/ 5 రేటింగ్‌తో  తో వెనుకబడి ఉన్నాయి.

also read కరోనా వ్యాక్సిన్ కోసం భారత ప్రభుత్వ యాప్: మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇవే.. ...

మొత్తం మీద వోడాఫోన్ ఐడియా కస్టమర్లలలో 88.4 శాతం మంది వినియోగదారులు సంతృప్తికరమైన వాయిస్ నాణ్యతను, 8.24 మండి తక్కువ వాయిస్ నాణ్యతను, 3.62 శాతం మండి కాల్స్ డ్రాప్‌ సమస్యలను ఎదురుకొన్నారు.

ఇండోర్ కాల్ నాణ్యత పరంగా వోడాఫోన్ 4.6 రేటింగ్ పొందగా, అవుట్డోర్ కాల్ నాణ్యత పరంగా 4.3 పొందింది. ఐడియా ఇండోర్ కాల్ నాణ్యత పరంగా 4.9, అవుట్డోర్ కాల్ నాణ్యత పరంగా  4.8 సాధించింది. ఎయిర్‌టెల్‌కు ఇండోర్ 3.9, అవుట్డోర్ 3.5, బిఎస్‌ఎన్‌ఎల్ ఇండోర్ 3.9, అవుట్డోర్ 4.3, జియోకి ఇండోర్ 3.9, అవుట్డోర్ 3.6 లభించాయి.

గత నెల అక్టోబర్ నెలలో వాయిస్ క్వాలిటీలో బిఎస్ఎన్ఎల్ 3.7 రేటింగ్‌తో ఎయిర్‌టెల్ 3.5తో, ఐడియా 3.3తో, జియో 3.2 తో, వొడాఫోన్ 3.1 తో చివరి స్థానంలో నిలిచింది.

అక్టోబర్లో వోడాఫోన్ ఐడియా యూసర్లలో 63.86 శాతం మంది వినియోగదారులు సంతృప్తికరమైన వాయిస్ నాణ్యతను అనుభవించారు, 25.28 శాతం మంది వాయిస్ నాణ్యత తక్కువ ఉన్నట్లు నివేదించారు. 10.85 శాతం వినియోగదారులు కాల్ డ్రాప్స్ గురించి ఫిర్యాదు చేశారు.

అక్టోబర్‌లో ఇండోర్, అవుట్డోర్ కాల్ నాణ్యత పరంగా వోడాఫోన్‌ 3.2 అండ్ 2.6, ఐడియా 3.4 ఇంకా 3.1 లభించాయి. వోడాఫోన్ ఐడియా నవంబర్లో గణనీయంగా మెరుగైన నాణ్యత నాణ్యత అనుభవాన్ని అందించినట్లు తెలుస్తోంది.