భారతదేశంలోని అతిపెద్ద ఓవర్-ది-టాప్ (ఓ‌టి‌టి) కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన జి5 యాప్ ఇప్పుడు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా ఉచితంగా జి5 యాప్ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. దేశీయ టెలికాం ఆపరేటర్లు వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కొన్ని ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్లతో కస్టమర్లకు ఉచిత జి5 సబ్ స్క్రిప్షన్ అందిస్తున్నాయి.  

ఎయిర్‌టెల్ తాజాగా జి5 సభ్యత్వంతో ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ.289, దీనితో 1.5జి‌బి రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లతో పాటు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌నైనా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ చేసుకోవచ్చు. అలాగే కస్టమర్లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ప్రయోజనలతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంకి ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందువచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా కూడా 5 ప్రీపెయిడ్ ప్లాన్‌ల ద్వారా జి5  సబ్ స్క్రిప్షన్ తీసుకొచ్చింది. ఇందులో మొదటి ప్లాన్ రూ.405. దీంతో మొత్తం 90 జీబీ డేటాతో పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. వినియోగదారులు 1 సంవత్సరం వరకు ఉచితంగా వోడాఫోన్ ఐడియా మూవీస్ & టీవీకి అక్సెస్ పొందుతారు. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

also read క్రెడిట్ కార్డు సైజులో అదిరిపోయే టెక్నాలజీతో ఒప్పో కొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ చూసారా‌.. ...

రూ .555 ప్లాన్. ఈ ప్లాన్ 56 రోజుల పాటు 2జి‌బి రోజువారీ డేటా వస్తుంది. 1 సంవత్సరం పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు,  జి5 సభ్యత్వం అందిస్తుంది. ఈ ప్లాన్ కొన్ని వారాల క్రితం వోడాఫోన్ ఐడియా ప్రవేశపెట్టిన వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఆఫర్‌తో కూడా వస్తుంది.


మిగతా రెండు ఆన్ లిమిటెడ్ వాయిస్, డేటా ప్యాక్‌లు రూ .795, రూ .2,595. ఈ రూ .795 ప్యాక్ రూ.595 ప్లాన్‌తో సమానంగా ఉంటుంది, అయితే దీని వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఒక సంవత్సరం పాటు జి5 ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు.

రూ.2,595 ప్లాన్ కూడా వీకెండ్ డేటా రోల్ఓవర్ ఆఫర్‌తో వస్తుంది. అయితే ఈ ప్లాన్ 1 సంవత్సరం (365 రోజులు) పాటు  జి5  సభ్యత్వంతో వస్తుంది.

జి5 సభ్యత్వం అందించే వోడాఫోన్ ఐడియా చివరి ప్రీపెయిడ్ ప్యాక్  రూ.355 ప్లాన్, కానీ ఇది డేటా ప్యాక్. ఈ ప్లాన్ 50జి‌బి డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది.

ఒక సంవత్సరానికి జి5 సబ్ స్క్రిప్షన్ కొనడానికి సాధారణంగా రూ .999 ఖర్చు అవుతుంది. అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో వాయిస్ కాలింగ్, డాటాతో పాటు ఉచితంగా సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.